For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ 2019లో పడిపోయిన పారిశ్రామికోత్పత్తి

|

దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్ 2019లో 0.3 శాతానికి పడిపోయినట్లు బుధవారం ప్రభుత్వ డేటా వెల్లడించింది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (IIP) 2018 డిసెంబర్ నెలలో 2.5 శాతంగా ఉంది. కానీ గత ఏడాది డిసెంబర్‌లో మాత్రం తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఔట్ పుట్ అంతకుముందు ఏడాది 2.9 శాతంతో పోలిస్తే ఇప్పుడు 1.2 శాతానికి దిగజారింది.

2019 డిసెంబర్ నెలలో ఎలక్ట్రిసిటీ జనరేషన్ 0.1 శాతం తగ్గింది. 2018 డిసెంబర్‌లో ఇది 4.5 శాతం పెరిగింది. మైనింగ్ సెక్టార్ ఔట్ పుట్ ఈసారి 5.4 శాతం పెరగగా, అంతకుముందు ఏడాది 1 శాతం మాత్రమే పెరిగింది. పారిశ్రామికోత్పత్తి (IIP) వృద్ధి 2018-19 ఏప్రిల్-డిసెంబర్ కాలం (4.7 శాతం)తో పోలిస్తే 2019-20 అదే కాలంలో 0.5 శాతానికి పరిమితమైంది.

సంగారెడ్డిలో దేశంలోనే అతిపెద్ద హ్యాట్సన్ ప్లాంట్, 4,500 మందికి లబ్ధిసంగారెడ్డిలో దేశంలోనే అతిపెద్ద హ్యాట్సన్ ప్లాంట్, 4,500 మందికి లబ్ధి

కీలకమైన తయారీరంగంలో ఉత్పత్తి క్షీణించడం పారిశ్రామికోత్పత్తి సూచీ (IIP)ని రుణాత్మకంలోకి నెట్టింది. 2018 డిసెంబర్ నెలలో IIP వృద్ధిరేటు 2.5 శాతంగా ఉన్నట్లు బుధవారం అధికారిక గణాంకాల ద్వారా స్పష్టమైంది. గత ఏడాది ఆగస్ట్ నుంచి వరుసగా 3 నెలలపాటు మైనస్‌లోనే నమోదైన గణాంకాలు నవంబర్ నెలలో తిరిగి వృద్ధిని సంతరించుకుంది.

Industrial production shrinks 0.3 pc in Dec

ఆగస్ట్‌లో -1.4%, సెప్టెంబర్‌లో -4.6%, అక్టోబర్‌లో -4% నమోదైన IIP, నవంబర్‌లో 1.8% శాతానికి పెరిగింది. మళ్లీ డిసెంబర్ నెలలో నిరాశపరిచింది. తయారీ రంగంలో ఉత్పాదక రేటు 2019 డిసెంబర్‌లో -1.2 శాతంగా ఉంది.

క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి, పెట్టుబడుల ప్రామాణిక సూచీ గత ఏడాది డిసెంబర్‌లో -18.2% పతనమైంది. అంతకుముందు డిసెంబర్‌లో 4.2% వృద్ధి కనిపిస్తోంది. మొత్తంగా తయారీ రంగంలోని 23 పరిశ్రమల్లో 16 ప్రతికూల వృద్ధినే సూచించడం గమనార్హం.

English summary

డిసెంబర్ 2019లో పడిపోయిన పారిశ్రామికోత్పత్తి | Industrial production shrinks 0.3 pc in Dec

The country's industrial output contracted by 0.3 per cent in December, weighed by a decline in the manufacturing sector, government data showed on Wednesday.
Story first published: Thursday, February 13, 2020, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X