For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయికి అమెరికాలో అరుదైన గౌరవం

|

ఇండియన్-అమెరికన్, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా నేషనల్ పోట్రెయిట్ గాలరీలో ఆమెకు స్థానం దక్కింది. ఆమెతో పాటు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ప్రాన్సెస్ అర్నాల్డ్ సహా మరికొంతమందికి ఈ గ్యాలరీలో చోటు దక్కింది. ఈ కార్యక్రమానికి మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్ తదితర ప్రముఖులు వచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రానూయీ మాట్లాడారు.

కేంద్రం 'ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు': ఎక్కడైనా రేషన్కేంద్రం 'ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు': ఎక్కడైనా రేషన్

మహిళలు తమను తాము సెకండ్ గ్రేడ్ పౌరులుగా పరిగణించుకోవద్దని సూచించారు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. కష్టపడి పని చేస్తే పుట్టిన ప్రాంతం, సంస్కృతితో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయన్నారు. తనకు ఈ గౌరవం ఇవ్వడం ద్వారా.. మహిళలు తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అమెరికా గొప్ప దేశమన్న సందేశం ఇచ్చారన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మేలుకొలుపు అన్నారు.

Indra Nooyi inducted into National Portrait Gallery

సమాజంలో సానుకూల మార్పు తీసుకు వచ్చే వారికి సరైన గౌరవం లభిస్తుందని చెప్పేందుకు ఇది నిదర్శనం అన్నారు. అమెరికా నిర్మాణం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారికి నేషనల్ పోట్రెయిట్ గ్యాలరీలో స్థానం కల్పిస్తారు. దీనిని 1962లో స్థాపించారు. దశాబ్దాలుగా పేయింటింగ్స్, ప్రింట్స్, డ్రాయింగ్, చెక్కినవే కాకుండా ఇటీవలి డిజిటల్ వరకు 23,000కు పైగా ఐటమ్స్ ఈ గ్యాలరీలో ఉన్నాయి. ఈ గ్యాలరీలోకి ప్రతి ఏడాది 150 నుంచి 200 పోట్రెయిట్స్ చేరుతున్నాయి.

English summary

పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయికి అమెరికాలో అరుదైన గౌరవం | Indra Nooyi inducted into National Portrait Gallery

former PepsiCo head Indra Nooyi and Amazon CEO Jeff Bezos have been inducted into the prestigious Smithsonian National Portrait Gallery for their accomplishments and positive impact on America's shared history, development and culture.
Story first published: Monday, November 18, 2019, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X