For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాణిజ్య రుణాల ఎఫెక్ట్, 559 బిలియన్ డాలర్లకు పెరిగిన అప్పులు

|

ఢిల్లీ: భారత విదేశీ రుణాలు మార్చి నాటికి 2.8 శాతం పెరిగి 558.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో ఎక్కువగా కమర్షియల్ రుణాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం రుణభారం రూ.101.3 లక్షల కోట్లు ఉండగా, అందులో విదేశీ రుణభారం రూ.41.88 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది మార్చి చివరి నాటికి మొత్తం రుణభారం రూ.94.6 లక్షల కోట్లు ఉండగా, విదేశీ రుణభారం రూ.41.73 లక్షల కోట్లుగా ఉంది.

టెక్ దిగ్గజం ఆపిల్ శుభవార్త: మరో 4 రోజుల్లో తొలి ఆన్‌లైన్ స్టోర్టెక్ దిగ్గజం ఆపిల్ శుభవార్త: మరో 4 రోజుల్లో తొలి ఆన్‌లైన్ స్టోర్

పెరిగిన విదేశీ రుణాలు

పెరిగిన విదేశీ రుణాలు

2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎక్స్ట‌టర్నల్ డెబిట్స్‌తో ఫారెన్ కరెన్సీ రిజర్వ్ రేషియం 85.5 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది 76 శాతంగా ఉంది. జీడీపీలో విదేశీ రుణాల రేషియో 2020 మార్చి చివరి నాటికి 20.6 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది ఇది 19.8 శాతంగా ఉంది. ఈ మేరకు ఇండియా ఎక్స్‌టర్నల్ డెబిట్స్: ఎ స్టేటస్ రిపోర్ట్: 2021-20 రిపోర్ట్ వెల్లడిస్తోంది. 2019 మార్చి చివరి నాటితో పోలిస్తే సావరీన్ డెబిట్స్ 3 శాతం క్షీణించి 100.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సావరీన్ రుణాల్లో ఎక్కువగా ఉండే ద్వైపాక్షిక వనరుల వంటి రుణాలు 4.9 శాతం పెరిగి 87.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. నాన్ సావరీన్ రుణాలు 4.2 శాతం పెరిగి 457.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య రుణాలు సమీకరించడమే ఇందుకు కారణమని తెలిపింది.

వర్తమాన మార్కెట్లో రుణభారం

వర్తమాన మార్కెట్లో రుణభారం

ఎన్నారై ఔట్‌స్టాండింగ్ డిపాజిట్ల 130.6 బిలియన్ డాలర్లగా ఉంది. ఇది దాదాపు గత ఏడాదితో సమానం. పలు వర్థమాన మార్కెట్‌లలో ఆర్థికరంగం విస్తరిస్తుంటే విదేశీ రుణభారం పెరగడం సహజమేనని, ఇందుకు భారత్ కూడా అతీతం కాదని ఈ నివేదిక పేర్కొంది. గత కొన్నేళ్లలో ప్రయివేటు కంపెనీలు విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించడాన్ని ప్రోత్సహించేలా విధానాల్లో మార్పువల్ల ప్రయివేటు విభాగంలో రుణసమీకరణ పెరిగిందని తెలిపింది.

ఆర్థికేతర రంగాల సంస్థలు

ఆర్థికేతర రంగాల సంస్థలు

ప్రధానంగా ఆర్థికేతర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఎక్కువ మొత్తాల్లో రుణాలు సమీకరించినట్టు తెలిపింది. ఈ విభాగంలో మొత్తం రుణ సమీకరణలో ఆ సంస్థలు తీసుకున్న రుణాల వాటా 42 శాతం ఉంది. డిపాజిట్ సేకరించే కార్పొరేషన్స్ ద్వారా సమీకరించిన రుణాలు 28 శాతం ఉంది. సాధారణ ప్రభుత్వ రుణాల వాటా 18.1 శాతం ఉంది. మొత్తం రుణభారంలో ఏడాదికి పైబడి మెచ్యూరిటీ కలిగిన దీర్ఘకాలిక విదేశీ రుణాల వాటా 81 శాతం ఉండగా, మిగతా 19 శాతం స్వల్పకాలిక వాణిజ్య రుణాలు.

English summary

వాణిజ్య రుణాల ఎఫెక్ట్, 559 బిలియన్ డాలర్లకు పెరిగిన అప్పులు | India's external debt up nearly 3 percent to USD 559 billion at March end

India's total external debt increased by 2.8 per cent to USD 558.5 billion at the end of March mainly on account of a rise in commercial borrowings, according to a report released by the Finance Ministry. The external debt stood at USD 543 billion at end-March 2019.
Story first published: Sunday, September 20, 2020, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X