For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..

|

Modi Vs Manmohan: వచ్చే నెల ఒకటో తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్‌ కావటంతో దీనిపై అందరి ఆశలు ఉన్నాయి. మోదీ సర్కార్ హయాంలో 2020, 2021, 2022 సంవత్సరాలు చాలా క్షిష్టమైనవిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో కరోనా నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు చాలా ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఉద్యోగాల కోత..

ఉద్యోగాల కోత..

అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల కారణంగా వరల్డ్ ఎకానమీ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉద్యోగుల కోత అనే పదం సర్వసాధారణంగా మారిపోయింది. మాంద్యం పరిస్థితులు ముదరటంతో ప్రభుత్వాలు సైతం దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీల్లో ప్రధానంగా కోతలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగ భద్రత అనే మాట మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ద్రవ్యోల్బణం..

ద్రవ్యోల్బణం..

సులువుగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ద్రవ్యోల్బణం అనగా వస్తువులు, సేవలు, ఆహారపదార్థాల ధరలు గణనీయంగా పెరగటం. అంటే అదాయం కన్నా ఖర్చులు అధికం కావటం అన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆహార కొరత ఏర్పడింది. ఇంధనం, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా యుద్ధం ప్రారంభ నెలల్లో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో భారత దిగుమతుల బిల్లు బాగా పెరిగింది.

పెరుగుతున్న ఆర్థిక లోటు..

పెరుగుతున్న ఆర్థిక లోటు..

భారతదేశ ఆర్థిక లోటు లేదా దేశ ఆదాయ వ్యయాల మధ్య అంతరం పెరిగింది. డిసెంబర్‌లో వాణిజ్య లోటు రూ. 1.94 లక్షల కోట్లుగా ఉంది. మనం చేసుకున్న దిగుమతులు, మన దేశం చేసిన ఎగుమతులకు మధ్య వ్యత్యాసాన్నే వాణిజ్య లోటు అంటారు. రూపాయి మారకపు విలువ పతనానికి ఇది కూడా ఒక కీలక కారణంగా నిలుస్తుంటుంది. డిసెంబరులో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం మేర క్షీణించాయి.

మోదీ - మన్మోహన్ సింగ్..

మోదీ - మన్మోహన్ సింగ్..

ఆర్థిక వ్యవస్థ మోదీ, మన్మోహన్ హయాంలలో ఏది మెరుగ్గా ఉందే విషయంపై ప్రముఖ వార్తా సంస్త సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్డీఏ ప్ర‌భుత్వ ప‌ని తీరుపై దేశ ప్ర‌జ‌ల మూడ్ ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో మోదీ, మన్మోహన్ ప్రభుత్వాలపై స్పందిస్తూ 51 శాతం మంది ప్రజలు నరేంద్రమోదీకి ఓటేశారు. 36 శాతం మంది మన్మోహన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయగా.. 13 శాతం మంది మాత్రం స్పష్టంగా ఏమి చెప్పలేమని అన్నారు.

English summary

Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే.. | Indians supported modi economic management in mood of the nation survey

Indians supported modi economic management in mood of the nation survey
Story first published: Sunday, January 29, 2023, 12:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X