For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021లో ఉద్యోగాలొస్తాయి, వేతనాలు పెరుగుతాయి! మాకు కంపెనీ.. కంపెనీకి మేం

|

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతీయులు 2021పై ఆశావాహ దృక్పథంతో ఉన్నట్లు జాబ్ సైట్ ఇండీడ్ సర్వేలో వెల్లడైంది. ఉద్యోగాలు, వేతనాలపై ఈ ప్రాంతంలో భారతీయులు అత్యంత ధీమాగా ఉన్నారు. ఈ మేరకు తమ గ్లోబల్ స్టడీలో ఈ అంశం వెల్లడైనట్లు తెలిపింది. ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎక్కువమంది ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. భారత్‌లో 56 శాతం, ఆస్ట్రేలియాలో 20 శాతం, సింగపూర్‌లో 23 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఈ సంవత్సరం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

భారత్‌లో సౌదీ అరేబియా మరిన్ని పెట్టుబడులు, ఆర్థికవ్యవస్థ బౌన్స్ బ్యాక్భారత్‌లో సౌదీ అరేబియా మరిన్ని పెట్టుబడులు, ఆర్థికవ్యవస్థ బౌన్స్ బ్యాక్

భారత్‌లోనే ఎక్కువ ధీమా

భారత్‌లోనే ఎక్కువ ధీమా

ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు తమ కెరీర్ అవకాశాలపై చాలా ఆశాజనకంగా ఉన్నారు. ఇండీడ్ చేసిన సర్వేలో భారత్‌లోనే ఇది అత్యధికంగా ఉంది. వేతన పెంపుపై 2021లో భారత్‌లో 56 శాతం మంది, ఆస్ట్రేలియాలో 20 శాతం మంది, సింగపూర్‌లో 23 శాతం మంది ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. ఉద్యోగ భద్రతపై 59 శాతం మంది, ఉద్యోగుల శ్రేయస్సుపై 44 శాతం మంది ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా కరోనా టీకా వస్తుందనే వార్తలు ఈ సానుకూల ధోరణికి కారణంగా చెబుతున్నారు.

ఈ దేశాలలో సర్వే

ఈ దేశాలలో సర్వే

భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలతో పాటు యూకే, అమెరికా, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, మెక్సికో, బ్రెజిల్, కెనడాలలో నవంబర్ 13వ తేదీ నుండి 30వ తేదీ మధ్య సర్వే చేసింది. 3600 మంది ఉద్యోగ సంస్థలు, 14142 మంది ఉద్యోగులను సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది.

కంపెనీకి మేం.. మాకు కంపెనీ

కంపెనీకి మేం.. మాకు కంపెనీ

ఇతర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వెళ్లడానికి సిద్దంగా లేమని 54 శాతం మంది తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్యాలయాల్లో సంతృప్తిగా ఉన్నట్లు ఎక్కువ మంది వెల్లడించారు. కొత్త సంస్థలో ఉద్యోగ భద్రత ఎలా ఉంటుందనే అనుమానాలు ఉన్నాట్లు తెలిపారు. సంక్షోభ సమయంలో కంపెనీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చామని 66 శాతం మంది చెప్పారు. కరోనా సమయంలో కుటుంబంతో గడిపేందుకు ఎక్కువ సమయం దొరికిందని తెలిపారు.

English summary

2021లో ఉద్యోగాలొస్తాయి, వేతనాలు పెరుగుతాయి! మాకు కంపెనీ.. కంపెనీకి మేం | Indians most optimistic in Asia Pacific about job, pay rise prospects In 2021

Indians are the most optimistic in Asia Pacific region about job and pay rise prospects in 2021, job site ‘Indeed’ said on Monday, citing its global study.
Story first published: Tuesday, December 22, 2020, 7:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X