For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Swiss Bank: స్విస్ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయల డిపాజిట్లు.. అంతా బ్లాక్ మనీయేనా..?

|

Swiss Bank: స్విస్ బ్యాంకుల్లో భారతీయ కంపెనీలు, వ్యక్తుల డబ్బు 2021 సంవత్సరంలో 50 శాతం మేర పెరిగాయి. ఇవి 14 సంవత్సరాల గరిష్ఠ స్థాయి అయిన 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకున్నాయి. భారత కరెన్సీ ప్రకారం ఈ సొమ్ము మెుత్తం రూ. 30,500 కోట్లకు పైగా చేరుకుంది. భారత్ లోని స్విస్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల శాఖల్లో జమ చేసిన డబ్బు కూడా ఇందులో భాగంగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ గురువారం విడుదల చేసిన వార్షిక డేటా ప్రకారం.. సెక్యూరిటీలతో సహా సంబంధిత సాధనాల ద్వారా వాటాలు, కస్టమర్ డిపాజిట్లు పెరగడం వల్ల స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు పెరిగిందని వెల్లడించింది.

రెండేళ్లు తగ్గినా.. భారీగా పెరిగిన భారతీయుల డిపాజిట్లు..

రెండేళ్లు తగ్గినా.. భారీగా పెరిగిన భారతీయుల డిపాజిట్లు..

అంతకుముందు 2020 సంవత్సరం చివరి నాటికి.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 20,700 కోట్లుగా ఉంది. అంతేకాకుండా.. భారతీయ కస్టమర్ల సేవింగ్స్ లేదా డిపాజిట్ ఖాతాల్లోని డిపాజిట్లు రెండేళ్ల క్షీణత తర్వాత 2021లో రూ. 4,800 కోట్లకు చేరి ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. డేటా ప్రకారం.. 2021 చివరి నాటికి భారతీయ ఖాతాదారులకు స్విస్ బ్యాంకుల మొత్తం బాధ్యత 383.19 కోట్ల స్విస్ ఫ్రాంక్‌లు. ఇందులో 6,020 మిలియన్ల స్విస్ ఫ్రాంక్‌లు కస్టమర్ డిపాజిట్ల రూపంలో ఉండగా, 1,225 మిలియన్ల స్విస్ ఫ్రాంక్‌లు ఇతర బ్యాంకుల ద్వారా, 3 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు ట్రస్టుల ద్వారా డిపాజిట్ చేయబడ్డాయని తెలుస్తోంది.

ఈ గణాంకాలను స్విట్జర్లాండ్ బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ కి అందించాయి. ఇవి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనాన్ని ప్రతిబింబించవు. ఈ గణాంకాల్లో భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు లేదా ఇతరులు మూడవ దేశానికి చెందిన సంస్థల పేరుతో స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బును కూడా చేర్చలేదు. అయితే స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన భారతీయుల సొమ్మును స్విస్ ప్రభుత్వం 'నల్లధనం'గా పరిగణించడం లేదు. పన్ను ఎగవేతపై పోరాటంలో భారత్‌కు ఎప్పుడూ చురుగ్గా మద్దతు ఇస్తుందని స్విట్జర్లాండ్ పేర్కొంది.

డిపాజిట్ల అగ్రస్థానంలో యూకే..

డిపాజిట్ల అగ్రస్థానంలో యూకే..

విదేశీ కస్టమర్ల విషయానికి వస్తే.. యూకే అత్యధికంగా స్విస్ బ్యాంకుల్లో 379 బిలియన్ల స్విస్ ఫ్రాంక్ డిపాజిట్లను కలిగి ఉంది. దీని తరువాత అమెరికా ఖాతాదారులకు స్విస్ బ్యాంకుల్లో 168 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు ఉన్నాయి. 100 బిలియన్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన క్లయింట్‌ల జాబితాలో అమెరికా, యూకే దేశాలను మాత్రమే చేర్చడం జరిగింది. ఇదే సమయంలో.. స్విస్ బ్యాంకుల్లో డబ్బు ఉన్న మొదటి పది దేశాల జాబితాలో.. వెస్టిండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, హాంకాంగ్, బహామాస్, నెదర్లాండ్స్, కేమన్ ఐలాండ్స్, సైప్రస్ ఉన్నాయి. ఈ జాబితాలో పోలాండ్, దక్షిణ కొరియా, స్వీడన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలుండగా.. భారత్ మాత్రం 44వ స్థానంలో ఉంది.

పాక్, బంగ్లాదేశ్ లు సైతం..

పాక్, బంగ్లాదేశ్ లు సైతం..

పాకిస్థాన్ పౌరుల డిపాజిట్లు స్విస్ బ్యాంకుల్లో 712 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు ఉండగా.. బంగ్లాదేశ్ కస్టమర్ల డిపాజిట్లు 872 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పెరిగాయి. భారత్‌తో పాటు.. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వంటి పొరుగు దేశాల్లో స్విస్‌ బ్యాంకుల్లోనూ నల్లధనంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

English summary

Swiss Bank: స్విస్ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయల డిపాజిట్లు.. అంతా బ్లాక్ మనీయేనా..? | Indians deposits in swiss banks rose to 14 years high with 30,500 crores

indians deposits in swiss banks mounting high after two years fall
Story first published: Friday, June 17, 2022, 7:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X