For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indian IT: రెండు లక్షల నియామకాలు.. రూ.83 వేల కోట్ల లాభం.. అదర కొడుతున్న దేశీ ఐటీ కంపెనీలు..

|

Indian IT: బుధవారం నాస్కామ్ కొత్త విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సగటు వేతనం 1,06,360 డాలర్లుగా ఉంది. భారత ఐటీ పరిశ్రమ గత సంవత్సరం అమెరికాలో 2,07,000 మంది టెక్కీలకు ఉద్యోగాలు కల్పించటం ద్వారా 103 బిలియన్ డాలర్ల ఆదాయనాన్ని ఆర్జించాయి. భారతీయ IT 396 బిలియన్ డాలర్ల వ్యాపారంతో పాటు 16 లక్షల ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడింది. దీనివల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు 198 బిలియన్ డాలర్లకు పైగా సహకారం అందించింది.

 డిజిటల్ యుగంలో..

డిజిటల్ యుగంలో..

"భారత సాంకేతిక రంగం ఫార్చూన్ 500 కంపెనీల్లో 75 శాతానికి పైగా సంస్థలతో పని చేస్తోంది. వాటిలో ఎక్కువ భాగం అమెరికాలో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి. అందువల్ల డిజిటల్ యుగం క్లిష్టమైన నైపుణ్య సవాళ్లను అర్థం చేసుకోవడానికి, వాటిని ఎదుర్కోవడానికి బాగా సన్నద్ధమై ఉన్నాయి" అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ అన్నారు.

భారీగా విరాళాలు..

భారీగా విరాళాలు..

దాదాపు 180 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కమ్యూనిటీ కళాశాలలు, ఇతరులతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, భారతీయ సాంకేతిక సంస్థలు కూడా 1.1 బిలియన్ డాలర్లకుపైగా విరాళాన్ని అందించాయి.సాంప్రదాయ టెక్ హబ్ రాష్ట్రాల వెలుపల టాలెంట్ పూల్‌ను విస్తరించడంలో, USలోని భారతీయ సాంకేతిక పరిశ్రమ కీలక పాత్రను పోషించింది. కొత్తగా ఎమర్జింగ్ రాష్ట్రాల్లో ఉపాధి రేటు గత పదేళ్ల కాలంలో 82 శాతం పెరిగింది.

కీలక సహకారం..

కీలక సహకారం..

"భారత సాంకేతిక పరిశ్రమ స్థానిక పెట్టుబడులు, ఆవిష్కరణలు, లేబర్ ఫోర్స్ పెంపొందించడం, స్థానిక శ్రామికశక్తికి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా US ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సహకారాన్ని అందిస్తుంది" అని ఘోష్ తెలిపారు.

English summary

Indian IT: రెండు లక్షల నియామకాలు.. రూ.83 వేల కోట్ల లాభం.. అదర కొడుతున్న దేశీ ఐటీ కంపెనీలు.. | Indian Tech Companies Hired americans and earned huge revenues Nasscom report says

Indian Tech Companies Hired 200,000 Americans and Generated Rs 83,000 Cr Business, Partnered With 180 US Companies
Story first published: Friday, July 15, 2022, 20:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X