For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rishi Sunak: భారత మూలాలతో UK ప్రధానిగా సునక్.. బ్రిటీషర్ల పాలన నుంచి వారిని పాలించే స్థాయికి..

|

Rishi Sunak: దీనినే కర్మఫలం అని భావిస్తారు భారతీయులు. ఒకప్పుడు భారత్ ను దోచుకున్న బ్రిటన్ సామ్రాజ్యం కేవలం 75 ఏళ్లలో సంక్షోభానికి చేరువైంది. భారత సంతతికి చెందిన వ్యక్తి ఇన్ఫోసిస్ కంపెనీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడైన రిషి సునక్ భారత చరిత్రలోనే కాక.. ప్రపంచ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించారు. కాలం ఎప్పుడూ ఒక్కరికే అనుకూలంగా ఉండదని మరోసారి నిరూపించారు. రిషి సునక్ గెలుపుతో పౌండ్ సైతం బలపడింది.

ఎన్నికల్లో విజయం..

రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో విజయం సాధించారు. UK తదుపరి ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా నిలిచారు. భారత మూలాలకు చెందిన వ్యక్తి దేశ ప్రధానిగా ఎన్నిక కావటం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ప్రధానిగా గెలిచిన లిజ్ ట్రస్ కేవలం 44 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. దీనికి కొన్ని ఆర్థిక కారణాలు ఉన్నాయి.

బోరిస్ తప్పుకోగా..

బోరిస్ తప్పుకోగా..

మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రేసు నుంచి వైదొలిగినప్పుడు నామినేట్ చేయడానికి అవసరమైన స్థాయి మద్దతును సేకరించడంలో సెంట్రిస్ట్ పెన్నీ మోర్డాంట్ విఫలమైనందున అతను డిఫాల్ట్‌గా నిలిచారు. దీంతో రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 42 ఏళ్ల సునక్ తొలి ప్రసంగంలో స్థిరత్వం, ఐక్యతకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఏర్పాటు..

ప్రభుత్వ ఏర్పాటు..

కింగ్ చార్లెస్‌తో సమావేశం సందర్భంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని సునక్‌ను ఆహ్వానించారు. అధికారికంగా ఆయనను ప్రధానమంత్రిని చేస్తారు. యూకే 200 ఏళ్ల చరిత్రలో అతి చిన్న వయస్సులో ప్రధానిగా గెలిచిన తొలి హిందువుగా గుర్తింపు పొందారు. సునక్ 2015 నుండి నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుండి ఎంపీగా పనిచేశారు.

మోదీ శుభాకాంక్షలు..

భారత ఖ్యాతిని ఖండాతరాలకు తీసుకెళ్లిన రిషి సునక్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేయటానికి తాను ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. దీనికి తోడు దీపావళి శుభాకాంక్షలు సైతం తెలిపారు. అందరూ కలికి నవ యుగంలో ముందుకు సాగుదామంటూ పిలుపునిచ్చారు.

ఆనంద్ మహీంద్రా..

రిషి ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేశారు. అందులో ఆయన 1947లో విన్స్టన్ చర్చిల్ భారతీయ నాయకులను తక్కువ చేసి మాట్లాడిన సందర్భాన్ని పంచుకున్నారు. అయితే 75 ఏళ్ల భారతావని గత చరిత్రను తిగరాసిందని అందులో చెప్పుకొచ్చారు. రిషి తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందిన తూర్పు ఆఫ్రికా నుంచి వలస వచ్చి.. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని కావటం అద్భుతమైనదని అందులో తెలిపారు.

అంచెలంచెలుగా ఎదిగి..

అంచెలంచెలుగా ఎదిగి..

యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి డిగ్రీలు పొందిన సునాక్.. గోల్డ్‌మన్ సాచ్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో పని చేశారు. సునాక్ యూకే ఆర్థిక మంత్రిగానూ పనిచేశారు. 2009లో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. వీరి కుటుంబం భారత్‌లోని పంజాబ్‌లో మూలాలు కలిగి ఉంది. రిషి వేసవి సెలవుల్లో సౌతాంప్టన్‌లోని ఇండియన్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా కూడా పనిచేశారు.

Read more about: rishi sunak
English summary

Rishi Sunak: భారత మూలాలతో UK ప్రధానిగా సునక్.. బ్రిటీషర్ల పాలన నుంచి వారిని పాలించే స్థాయికి.. | Indian Origin Man Rishi Sunak Became First Hindhu PM Of UK Know Details

Indian Origin Man Rishi Sunak Became First Hindhu PM Of UK Know Details
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X