For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IBM సీఈవోగా భారతీయ అరవింద్ కృష్ణ, రెడ్ హ్యాట్ కొనుగోలులో కీలక పాత్ర

|

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈవోల జాబితాలో మరో భారతీయుడు చేరారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సహా పలువురు ఆయా కంపెనీల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇప్పుడు అమెరికా ఐటీ దిగ్గజం IBM సీఈవోగా భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ నియమితులయ్యారు.

ప్రస్తుతం ఆ పదవిలో వర్జీనియా రొమెట్టీ ఉన్నారు. ఆయన పదవీ విరమణ నేపథ్యంలో ఆ బాధ్యతలను అరవింద్ కృష్ణ తీసుకోనున్నారు. ఈ మేరకు ఐబీఎం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 57 ఏళ్ల అరవింద్ కృష్ణ ప్రస్తుతం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్టువేర్ విభాగానికి చీఫ్‌గా ఉన్నారు.

అరవింద్ కృష్ణ ఐబీఎం నవ శకానికి సరైన నాయకుడని ఐబీఎం ప్రస్తుత సీఈవో రొమెట్టీ అన్నారు. ఐబీఎం రూపొందించిన కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తయారీలో ఆయన ఎనలేని కృషి చేశారన్నారు.

మోడీ హయాంలో జీడీపీ.. ఆరేళ్లలో ఇలా పెరుగుతూ, పడిపోయిందిమోడీ హయాంలో జీడీపీ.. ఆరేళ్లలో ఇలా పెరుగుతూ, పడిపోయింది

Indian origin Arvind Krishna elected new CEO of IBM

లైనక్స్ వంటి ప్రముఖ ఆపరేటింగ్ టెక్నాలజీని అందించిన రెడ్ హ్యాట్ కొనుగోలులో అరవింద్ కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తును శాసించబోయే హైబ్రిడ్ క్లోడ్ సాంకేతికత ప్రాముఖ్యతను ముందుగానే గ్రహించిన అరవింద్ రెడ్ హ్యాట్ కొనుగోలు ప్రతిపాదనను బోర్డు ముందుంచి, ఒప్పించారు.

ఐబీఎం ప్రస్తుత చైర్మన్ రొమెట్టీ ఈ ఏడాది చివరలో రిటైర్ కానున్నారు.
1990 అరవింద్ కృష్ణా ఐబీఎంలో చేరారు. కాన్పూర్ ఐఐటీలో సాంకేతిక శాస్త్రంలో డిగ్రీ, ఇల్లినాయిస్ యూనివర్సీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఆయన పీహెచ్‌డీ చేశారు. ఐబీఎం నాయకత్వ మార్పుపై మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఐబీఎం షేర్లు ఓ దశలో ఐదు శాతం మేర లాభపడ్డాయి.

తనను సీఈవోగా ఎన్నుకోవడంపై అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్స్, ప్రస్తుత సీఈవో రొమెట్టి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో తమ క్లయింట్లకు ఎదురయ్యే కష్టతరమైన సవాళ్లను అధిగమిస్తామన్నారు.

English summary

IBM సీఈవోగా భారతీయ అరవింద్ కృష్ణ, రెడ్ హ్యాట్ కొనుగోలులో కీలక పాత్ర | Indian origin Arvind Krishna elected new CEO of IBM

Dr. Arvind Krishna, an IIT Kanpur alumnus, has been named as the new IBM CEO. He will replace Virginia Rometty, the longtime CEO of International Business Machines Corporation (IBM). At IBM, he previously held the positions of General Manager of IBM Systems and Technology Group, General Manager of IBM Information Management and Vice President of Strategy for IBM Software.
Story first published: Friday, January 31, 2020, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X