For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్

|

భారత్‌లో కుబేరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రానున్న అయిదేళ్ల కాలంలో వీరి సంఖ్య మరో 63% పెరిగి 11,198కి చేరుకుంటుందని సర్వేలో వెల్లడైంది. 30 మిలియన్ డాలర్లు లేదా అంతకు ఎక్కువ వ్యక్తిగత ఆదాయం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ప్రస్తుతం దేశంలో 6,884 మంది కుబేరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో కుబేరుల జాబితాలోకి మరింత మంది జత కలుస్తారని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ఇటీవల విడుదల చేసిన వెల్దీ 2021 నివేదికలో తెలిపింది.

ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపు కొందరికి మాత్రమే!ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపు కొందరికి మాత్రమే!

ఇండోనేషియా, భారత్ టాప్

ఇండోనేషియా, భారత్ టాప్

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 5,21,653 అధిక విలువ కలిగిన సంపన్నులు (HNI)లు ఉన్నారు. 2025 నాటికి 27 శాతం పెరిగి 6,63,483కి చేరుకుంటుందని ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో 6,884 కోట్లుగా ఉన్నారు. రూ.225 కోట్లకు పైగా ఉన్న వారిని HNIలుగా పరిగణిస్తారు. ఇక,

భారత్ 2020లో భారత్‌లో కుబేరుల సంఖ్య 113గా ఉండగా, వచ్చే అయిదేళ్ల కాలంలో 43 శాతం వృద్ధితో 162కు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం కుబేరుల వృద్ధిలో ప్రపంచ సగటు 24 శాతం కాగా, ఆసియా సగటు 38 శాతంగా ఉంది. ఆసియాలో కూడా ఇండోనేషియా 67 శాతంతో ముందు నిలిచింది. ఆ తర్వాత 63 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోనే..

ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోనే..

భారత ఆర్థిక రాజధాని ముంబైలో కుబేరులు 920 మంది ఉండగా, ఢిల్లీలో 375 మంది, బెంగళూరులో 238 మంది ఉన్నారు. ఈ కుబేరుల్లో ఎక్కువ మంది బంగారు ఆభరణాలపై అత్యధికంగా పెట్టుబడులు పెట్టారు. గడియారాలు, వైన్, క్లాసిక్ కార్లు కూడా ఉన్నాయి.

ఆసియాలో సూపర్ పవర్

ఆసియాలో సూపర్ పవర్

కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రివకరీ అవుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. దీంతో రానున్న అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించే దిశలో సాగుతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా వెలుగులోకి వస్తోన్న రంగాల్లో అవకాశాలు కల్పించడం ద్వారా భారత్ ఆర్థికంగా మరింత పరిపుష్టిని సాధించే వీలుందన్నారు. ఆసియాలో సూపర్ పవర్‌గా ఆవిర్భవించవచ్చునని పేర్కొన్నారు.

English summary

అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్ | Indian millionaires count to grow 63 percent over next five years

Consumption-led Indian economy is churning out more millionaires at a pace faster than the average witnessed among Asian peers and also other global economies. This growth is not only expected to sustain but gain further momentum in the post-Covid19 pandemic scenario.
Story first published: Friday, February 26, 2021, 14:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X