కరోనా మహమ్మారి దెబ్బతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగం ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం వరకు తగ్గిపోవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ వైరస్ వల్ల, విమానయానం, ఆతిథ్యం, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కాబట్టి కాంట్రాక్టులు 7 శాతం నుండి 9 శాతం మేర తగ్గవచ్చునని పేర్కొంది. కరోనా కారణంగా వివిధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

ఆదాయ దేశాలపై భారీ దెబ్బ
గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 6 శాతం నుండి 8 శాతం వృద్ధి సాధిస్తుందని ఇక్రా అంచనా వేసింది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో దానిని సవరించి, 3 శాతం తగ్గిపోవచ్చునని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్ నాటికి టీసీఎస్ ప్రకటించిన ఫలితాల్లో ఆదాయం, లాభాలు తగ్గాయి. మూడో క్వార్టర్ నాటికి ప్రీ-కోవిడ్ పరిస్థితికి పుంజుకుంటామని తెలిపింది. టీసీఎస్ సహా వివిధ ఇండియన్ ఐటీ దిగ్గజాలకు అమెరికా, యూరోప్ దేశాల నుండి వచ్చే ఆదాయం ఎక్కువ. కరోనా వల్ల ఆ దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఆ దేశాల జీడీపీ ప్రభావం
అమెరికా, యూరోప్ దేశాల జీడీపీ వరుసగా 8.0, 10.2 శాతం చొప్పున క్షీణిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ మెరకు ఐటీ కంపెనీపై ప్రభావం ఉంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ జైన్ అన్నారు. ఈ దేశాల ఐటీ ఎగుమతులు 80 శాతం వరకు ఉంటాయి. కాబట్టి కొత్త కాంట్రాక్టులు 7-9 శాతం తగ్గిపోతాయని ఇక్రా అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు 90 శాతం ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తోందని తెలిపింది.

ఐటీ రంగానికి దెబ్బమీద దెబ్బ
2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, ఆ మరుసటి ఆర్థిక సంవత్సరానికి (2021-22) క్రమంగా కోలుకుంటుందని ఇక్రా అంచనా వేసింది. కరోనా కారణంగా ఇప్పటికే ఐటీ రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఆపరేషనల్ ఒత్తిళ్లు, వీసా నియంత్రణలు, కార్యాలయంలో కరోనా జాగ్రత్తలు... ఇలా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. దీనికి అదనపు ఖర్చులు అవుతున్నాయి. కరోనా ప్రభావం ఐటీ రంగంపై నేరుగా చూపకపోయినప్పటికీ క్లయింట్స్ పైన ప్రభావం.. ఈ రంగంపై పడుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications