For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరేళ్ల గరిష్టానికి ద్రవ్యోల్భణం, ఇటీవల తగ్గిన ఉల్లి, పాల ధరలు

|

జనవరి నెలలో ఆహార పదార్థాల ధరలు గరిష్టంగా ఉన్న నేపథ్యంలో భారత రిటైల్ ద్రవ్యోల్భణం ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంటుందని రూటర్స్ పోల్‌లో వెల్లడైంది. దీంతో ఆర్బీఐ రాబోవు కాలంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి - మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్భణం అంచనాలను ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. పాలు, పప్పులు, ముడిచమురు ధరల వల్ల ద్రవ్యోల్భణం అనిశ్చితిగా ఉందని అంచనా వేసింది. ద్రవ్యోల్భణంపై ఆహారం, ముడి చమురు, తయారీ వ్యయాలు వంటి పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. తాజాగా పోల్‌లో రిటైల్ ద్రవ్యోల్భణం జనవరి నెలలో ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంటుందని వెల్లడైంది.

స్టాక్ మార్కెట్లు, దెబ్బతీస్తున్న చైనా కరోనా వైరస్స్టాక్ మార్కెట్లు, దెబ్బతీస్తున్న చైనా కరోనా వైరస్

రిటైల్ ద్రవ్యోల్భణం

రిటైల్ ద్రవ్యోల్భణం

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య 40 మందికి పైగా ఆర్థికవేత్తలు జనవరి నెలలో ద్రవ్యోల్భణం 7.40 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇది డిసెంబర్ నెలలో 7.35 శాతంగా ఉంది. మే 2014 తర్వాత ఇదే అత్యధికం. ఆహార ద్రవ్యోల్భణం పెరుగుతూ ధరలు పెరుగుతున్నాయి.

కూరగాయల ద్రవ్యోల్భణం గరిష్టస్థాయికి చేరుకుంది వీక్లీ డేటా చూపిస్తోంది. సరఫరా పరిమితి తగ్గడంతో పాల ధరలు కూడా పెరిగాయి.

తగ్గిన ఉల్లి, ఆయిల్ ధరలు

తగ్గిన ఉల్లి, ఆయిల్ ధరలు

అయితే ఇటీవలి డేటా మాత్రం కొన్ని కూరగాయల ధరలు తగ్గినట్లుగా వెల్లడిస్తోంది. ఉల్లి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు రికార్డ్ హైకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇటీవలి ద్రవ్యోల్భణానికి ఉల్లి ధరలు పెరగడమూ ప్రధాన కారణం. ఇప్పుడు ఈ ధరలు తగ్గాయి. కరోనా వైరస్ కారణంగా ఆయిల్ ధరలు గత నెలలో 10 శాతం మేర తగ్గాయి. ఎందుకంటే ఆయిల్‌ను భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది.

అప్పుడే రేట్ కట్

అప్పుడే రేట్ కట్

ఆర్బీఐ గత క్యాలెండర్ ఇయర్‌లో 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇటీవల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో ఎక్కువగా ఇవే వడ్డీ రేట్లు కొనసాగే అవకాశముందని భావిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకుంటోంది. CPI దాదాపు 5 శాతం మేర తగ్గితేనే భవిష్యత్తులో వడ్డీ రేట్ కట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

English summary

ఆరేళ్ల గరిష్టానికి ద్రవ్యోల్భణం, ఇటీవల తగ్గిన ఉల్లి, పాల ధరలు | Indian inflation likely hit a near 6 year high in January

Indian retail inflation likely rose to a near six year peak in January as food prices stayed high, according to a small majority of economists in a Reuters poll, which may persuade the central bank to keep interest rates on hold in the coming months.
Story first published: Tuesday, February 11, 2020, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X