భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ అంచనా వేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు సహా వివిధ కారణాలతో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవచ్చునని పేర్కొంది. వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ కూడా ముగింపు దశకు వచ్చినట్లు తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించడంతో పాటు మూడీస్ కూడా ఇటీవల వృద్ధిరేటును సడలించింది. గతంలో కంటే తక్కువ ప్రతికూలత నమోదును అంచనా వేసింది. తాజాగా ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ వేగవంత రికవరీని అంచనా వేస్తోంది.

వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశం లేదు
2020లో క్షీణత రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్ మైనస్ 9.6 శాతం నుండి మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కఠిన, దీర్ఘకాల లాక్‌డౌన్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్భణం అదుపులోకి రాని నేపథ్యంలో రెపో రేటు మరింత తగ్గించే అవకాశాలు లేవని అభిప్రాయపడింది. ద్రవ్యోల్భణం 6 శాతానికి పైన ఉండే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చకపోవచ్చునని తెలిపింది.

అన్ని రంగాల్లో ధరల పెరుగుదల
వినిమయ ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో కరోనా ముందుస్థాయికి వచ్చిందని, ఇంధనం మినహా దాదాపు అన్ని రంగాల్లో ధరల పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్భణం అధికంగానే ఉండవచ్చునని పేర్కొంది. కూరగాయలు, గుడ్లు వంటి ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో ((7.61 శాతం) ఆరున్నర సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. ఆర్బీఐ 2 శాతం నుండి 4 శాతంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థాయిని మించింది. సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 7.27 శాతంగా నమోదయింది.

వడ్డీ రేట్లు మరింత తగ్గిస్తే..
అదే సమయంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ తెలిపింది. అందువల్ల ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గింపు ముగింపు దశకు చేరినట్లేనని భావిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఇప్పటికే స్థిర డిపాజిట్ రేటు 4.90 శాతం నుండి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఇది నెగెటివ్ రిటర్న్స్ అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వడ్డీ రేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రమైతే అది సేవింగ్స్, డిపాజిట్స్, కరెంట్ అకౌంట్స్ పైన ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని చెబుతున్నారు.
More From GoodReturns

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications