న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇందులో భాగంగా భారత్ ఆర్థిక రంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం 'The Rise of Finance: Causes, Consequences and Cure' పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచం.. అలాగే భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.
ఈ పుస్తకాన్ని వీ అనం నాగేశ్వరణ్, గుల్జార్ నటరాజన్ కలిసి రాశారు. నాగేశ్వరన్ IFMR గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్. నటరాజన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్‌లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ పుస్తకంపై నిర్మల మాట్లాడుతూ... ఇది పాఠకుల ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితులకు ఈ పుస్తకం అద్దం పడుతోందన్నారు.

చాలా వాటికి సమాధానాలు కూడా దొరుకుతాయని చెప్పారు. భారతదేశం అనేక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ పుస్తకం రావడం అభినందనీయమన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగడంతో అది భారత్ పైన కూడా ప్రభావం చూపిందని నిర్మల అన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications