For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హూరున్ గ్లోబల్ 500 జాబితాలో పడిపోయిన రిలయన్స్ సహా భారత కంపెనీలు!

|

హూరున్ గ్లోబల్ 500 లిస్ట్ కంపెనీల్లో భారత్‌కు చెందిన పలు కంపెనీల ర్యాంకులు పడిపోయాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆసియా దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ జాబితాలో మూడు స్థానాలు దిగజారింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ప్రపంచంలోని టాప్ 500 ప్రభుత్వేతర కంపెనీల జాబితాను హూరున్ గ్లోబల్ 500 లిస్ట్ పేరుతో విడుదల చేసింది. మన దేశానికి చెందిన డజన్ కంపెనీలు ఈసారి చోటు దక్కించుకున్నాయి. ఇందులో రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, విప్రో, ఏషియన్ పేయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి. చివరి మూడు (విప్రో, ఏషియన్ పేయింట్స్, హెచ్‌సీఎల్ ఈ ఏడాది కొత్తగా ఈ జాబితాలో చేరాయి.

గత ఏడాది ఈ జాబితాలో భారత్ నుండి 11 కంపెనీలు చోటు దక్కించుకోగా, ఈసారి 12కు పెరిగాయి. కానీ ర్యాంకులు మాత్రం పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ర్యాంక్ 3 పాయింట్లు దిగజారింది. ప్రపంచవ్యాప్తంగా విలువైన కంపెనీల జాబితాలో ఈ సంస్థ 57వ స్థానం దక్కించుకుంది. టీసీఎస్ ఒక ర్యాంక్ పడిపోయి 74వ స్థానంలో నిలిచింది.
HDFC బ్యాంకు 19 స్థానాలు పడిపోయి 124 ర్యాంకులో, HDFC 52 స్థానాలు దిగజారి 301వ ర్యాంకులో, కొటక్ మహీంద్రా బ్యాంక్ 96 స్థానాలు పతనమై 380వ ర్యాంకుకు పడిపోయింది.

Indian companies slip in global valuation ranking

ఒక్క ICICI బ్యాంకు మాత్రమే తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. 48 స్థానాలు ఎగబాకి 268వ ర్యాంకుకు చేరింది. ఇక, ఈ ఏడాది కొత్తగా జాబితాలో చోటు దక్కించుకున్న విప్రో(457 ర్యాంకు), ఏషియన్ పెయింట్స్(477 ర్యాంకు), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(498వ ర్యాంకు) దక్కించుకున్నాయి. ఇక ప్రపంచ అత్యంత విలువైన కంపెనీల విషయానికి వస్తే ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్పాబెట్ ముందు ఉన్నాయి. ఈ జాబితాలో అమెరికాకు చెందిన 243 కంపెనీలు, చైనాకు చెందిన 47 కంపెనీలు, జపాన్‌కు చెందిన 30 కంపెనీలు, యూకేకు చెందిన 24 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.

English summary

హూరున్ గ్లోబల్ 500 జాబితాలో పడిపోయిన రిలయన్స్ సహా భారత కంపెనీలు! | Indian companies slip in global valuation ranking

Ranking of many Indian companies, including Reliance, Tata Consultancy Services, HDFC Bank, HDFC and Bharti Airtel, declined compared with last year on the Hurun Global 500 list.
Story first published: Friday, August 20, 2021, 22:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X