For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Har Ghar Tiranga: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా..!

|

Har Ghar Tiranga: ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాతో కలిసి ఉన్న చిత్రంలో కనిపిస్తున్న ఈ మహిళ ఎవరు? ఈ ప్రసిద్ధ వ్యాపారవేత్తలకు ఆమె త్రివర్ణ పతాకాన్ని ఎందుకు ఇస్తోంది? ఈ ప్రశ్నలు మీ మదిలో మెదులుతున్నాయి కదూ. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

75వ స్వాతంత్ర్య దినోత్సవం

75వ స్వాతంత్ర్య దినోత్సవం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రితం స్వాతంత్య్ర దినోత్సవ ప్రచారాన్ని ప్రారంభించారు. కనీసం 20 కోట్ల ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. .

హర్ ఘర్ తిరంగా ప్రచారం..

హర్ ఘర్ తిరంగా ప్రచారం..

చిత్రంలో వ్యాపారవేత్తలైన ఆనంద్ మహీంద్రా, రతన్ టాటాలతో కలిసి ఉన్న మహిళ పైరు స్వాతి పాండే. ముంబై పోస్ట్ మాస్టర్ జనరల్ (PMG)గా ఉన్న ఆమె.. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా పారిశ్రామికవేత్తలకు త్రివర్ణ పతాకాన్ని ఇవ్వడానికి ఆమె వచ్చారు.

స్వాతి పాండే ఎవరు?

స్వాతి సీనియర్ బ్యూరోక్రాట్. ఆమె ప్రస్తుతం పోస్ట్ మాస్టర్ జనరల్ హోదాలో ఇండియా పోస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీకి సీఈవోగా కూడా పనిచేశారు. ఇక్కడ ఆమె ఏప్రిల్ 2016-మార్చి 2018 వరకు ఉన్నారు. ఇది కాకుండా ఆమె డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్)గా పనిచేశారు.

ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

"హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ముంబైలోని పోస్ట్ మాస్టర్ జనరల్ స్వాతి పాండే నుంచి త్రివర్ణ పతాకాన్ని అందుకోవడం గౌరవంగా ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తెలిపారు. మన పోస్టల్ వ్యవస్థలో జెండాను ఉన్నతంగా నిలిపినందుకు స్వాతికి ధన్యవాదాలు తెలిపారు. స్వాతి పాండే హర్ ఘర్ తిరంగా ప్రచారంలో రతన్ టాటాకు కూడా త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఇది కాకుండా.. ఆమె సినీ నటుడు అనుపమ్ ఖేర్‌కు త్రివర్ణ పతకాన్ని ఇచ్చారు. తపాలా శాఖ ఈ ప్రచారంలో 10 రోజుల్లో కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించింది. పోస్టల్ డిపార్ట్ మెంట్ ఆన్‌లైన్‌లో కూడా జెండాలను విక్రయిస్తోంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట త్రివర్ణ పతాక ప్రచారం కొనసాగుతోంది. తపాలా శాఖ 20 అంగుళాల వెడల్పు, 30 అంగుళాల పొడవున్న త్రివర్ణ పతాకాన్ని కేవలం రూ.25కే అందజేస్తోంది. ఆగస్టు 1 నుంచి పోస్టాఫీసుల ద్వారా జెండాల విక్రయం ప్రారంభమైంది. ఒకరు తమ ఇంటి నుంచే ఈ-పోస్టాఫీసు సేవ ద్వారా ఒకే ధరలో గరిష్ఠంగా ఐదు జెండాలను ఆర్డర్ చేయవచ్చు. ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకుండా పోస్ట్‌మ్యాన్ జెండాలను డెలివరీ చేస్తారు. దేశంలో ఇప్పటి వరకు 1.75 లక్షల మంది ఆన్‌లైన్‌లో జెండాను ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకున్నారు.

English summary

Har Ghar Tiranga: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా..! | indian business tycoons ratan tata and anand mahindra received national falg from postal department

indian business tycoons ratan tata and anand mahindra over independence day
Story first published: Sunday, August 14, 2022, 11:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X