For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్: 50% జనాభాకు 9 మంది బిలియనీర్ల సంపదన సమానం, 15 మంది వీరే..

|

దావోస్: భారత్‌లోని 63 మంది కుబేరుల వద్ద కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ సంపద ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF)కు చెందిన హక్కుల ఆక్స్‌ఫాం అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో టాప్ సంపన్నులు, దిగువ 50 శాతం మధ్య అంతరం పెరుగుతోందని పేర్కొంది. 2018-19 కేంద్ర బడ్జెట్ రూ.24.42 ట్రిలియన్లు కాగా అరవై మూడు మంది భారత కుబేరుల వద్ద అంతకంటే ఎక్కువ మొత్తం ఉంది.

మన బడ్జెట్ కంటే 63మంది బిలియనీర్ల సంపదే ఎక్కువ, సీఈవో స్థాయి శాలరీ కోసం 22,000 ఏళ్లుమన బడ్జెట్ కంటే 63మంది బిలియనీర్ల సంపదే ఎక్కువ, సీఈవో స్థాయి శాలరీ కోసం 22,000 ఏళ్లు

రెండేళ్లలో కుబేరుల సంపద ఇలా పెరిగింది

రెండేళ్లలో కుబేరుల సంపద ఇలా పెరిగింది

భారత కుబేరుల సంపదన 2017లో రూ.22.73 ట్రిలియన్ డాలర్లు ($325.5 బిలియన్లు) నుంచి 2019కి రూ.28.97 ట్రిలియన్ల ($408 బిలియన్లు)కు చేరుకుంది. ఈ మొత్తం 2019-20 కేంద్ర బడ్జెట్ రూ.27.86 ట్రిలియన్ల కంటే కూడా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. 2,153 మంది బిలియనీర్ల వద్ద 60 శాతం మంది అంటే 4.6 బిలియన్ జనాభా కంటే ఎక్కువ సంపద ఉంది.

15 మంది కన్స్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీ నుండి

15 మంది కన్స్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీ నుండి

2019లో భారత కుబేరుల్లో 15 మంది కన్స్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీకి చెందినవారు. 10 మంది ఫార్మాస్యూటికల్స్ సెక్టార్ నుండి ఉన్నారు. కుబేరులు, సామాన్యుల మధ్య అసమానతలు కేవలం భారత్‌లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. గతంతో పోలిస్తే ప్రపంచ కుబేరుల సంపద తగ్గినప్పటికీ వారి సంఖ్య మాత్రం రెండింతలకు చేరుకుంది.

75 శాతం సంపద వారిదే

75 శాతం సంపద వారిదే

భారత్‌లో టాప్ 10 శాతం కుబేరుల వద్దనే 74.3 దేశీయ సంపద ఉండటం గమనార్హం. టాప్ 1 శాతం కుబేరుల వద్ద ఉన్న సంపద కూడా మధ్యతరగతి, అట్టడుగు వర్గాల వద్ద లేదు. టాప్ 1 శాతం బిలియనీర్స్ వద్ద 42.5 శాతం జాతీయ సంపద ఉంటే, బాటం నుంచి 50 శాతం మంది వద్ద కేవలం 2.8 శాతం సంపద మాత్రమే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా టాప్ 1 శాతం కుబేరుల వద్ద... 953 మిలియన్ల ప్రజల వద్ద ఉన్న సొమ్ము కంటే నాలుగు రెట్లు ఉంది. బాటం నుంచి 70 శాతం మంది వద్ద కూడా లేని సంపద ఈ ఒక్క శాతం బిలియనీర్ల వద్ద ఉంది. బాటం 90 శాతం మంది వద్ద కేవలం 25.7 శాతం సంపద మాత్రమే ఉంది.

9 మంది వద్ద ఉన్న సొమ్ము ఈక్వల్ టు 50 శాతం మంది జనాభా

9 మంది వద్ద ఉన్న సొమ్ము ఈక్వల్ టు 50 శాతం మంది జనాభా

ప్రపంచంలోని టాప్ 9 బిలియనీర్లను తీసుకుంటే.. వారి వద్ద ఉన్న సంపద అట్టడుగు వర్గాల నుండి కనీసం 50 శాతం మంది వద్ద కూడా లేదు. అంటే ప్రపంచంలోని సగం మంది వద్ద కూడా లేని సంపదన కేవలం 9 మంది వద్ద ఉంది.

నీరు లేక కటకట

నీరు లేక కటకట

వాతావరణ మార్పుల నేపథ్యంలో రానున్న కాలంలో సంక్షోభాలు తప్పవని అంటున్నారు. 2025 నాటికి 2.4 బిలియన్ల మంది ప్రజలకు తగిన నీరు లేని ప్రాంతాల్లో ఉంటారు. మహిళలు, అమ్మాయిలు నీటిని తెచ్చుకునేందుకు అప్పటికీ ఎక్కువ దూరం నడవాల్సిన పరిస్థితులు.

English summary

షాకింగ్: 50% జనాభాకు 9 మంది బిలియనీర్ల సంపదన సమానం, 15 మంది వీరే.. | Indian billionaires wealth rose Rs 22.73 trillions to 28.97 trillions

“The wealth of billionaires rose from $325.5 billion (Rs 22.73 trillion) in 2017 to $408 billion (Rs 28.97 trillion) in 2019,” the report said. In fact, that amount is even higher than the 2019-20 Budget size of Rs 27.86 trillion, something the report did not mention.
Story first published: Thursday, January 23, 2020, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X