For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ భారత బ్యాంకుల వరస్ట్ పర్ఫార్మెన్స్, బంగ్లాదేశ్ బ్యాంకులు అదుర్స్!

|

2020 క్యాలెండర్ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాలకు చెందిన చిన్నతరహా బ్యాంకులు అత్యుత్తమ పనితీరును కనబరిచిన బ్యాంకింగ్ స్టాక్స్‌గా అవతరించాయి. అదే సమయంలో భారతీయ బ్యాంకులు చెత్త ప్రదర్శన చేశాయి. ఈ మేరకు ఎస్ అండ్ పీ మార్కెట్స్ ఇంటెలిజెన్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇరవై అతిపెద్ద బ్యాంకులలోని 16 బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ త్రైమాసికంలో క్షీణించింది. 2020లో భారతీయ బ్యాంక్స్ స్టాక్స్ క్షీణిస్తున్న ధోరణిలో ఉన్నాయి. ప్రధాన బ్యాంకులు జనవరి 1వ తేదీ నుండి ఆగస్ట్ 31వ తేదీ మధ్య 12 శాతం నుండి 50 శాతానికి పైగా నష్టపోయాయి.

గుడ్‌న్యూస్, వాట్సాప్‌లో EPFO సేవలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నెంబర్లు ఇవే...గుడ్‌న్యూస్, వాట్సాప్‌లో EPFO సేవలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నెంబర్లు ఇవే...

బంగ్లా బ్యాంక్ హిట్, యస్ బ్యాంక్ వరస్ట్ పర్ఫార్మెన్స్

బంగ్లా బ్యాంక్ హిట్, యస్ బ్యాంక్ వరస్ట్ పర్ఫార్మెన్స్

సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 66.52 శాతం రాబడిని నమోదుచేసి బంగ్లాదేశ్ సిటీ బ్యాంకు అగ్రస్థానంలో నిలిచింది. ప్రయివేటురంగ యస్ బ్యాంకు ఈ త్రైమాసికంలో 48.63 శాతం క్షీణతతో వరస్ట్ పర్ఫార్మెన్స్ బ్యాంకుల జాబితాలో ముందు ఉన్నది. ఈ జాబితాలో ఇతర భారతీయ బ్యాంకులు పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు జమ్ము అండ్ కాశ్మీర్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు Q3లో రెండంకెల ప్రతికూలతను నమోదు చేసింది.

తలసరి జీడీపీ తర్వాత బ్యాంకింగ్ షాక్

తలసరి జీడీపీ తర్వాత బ్యాంకింగ్ షాక్

ఈ త్రైమాసికంలో కరోనా మహమ్మారి ప్రధానంగా బ్యాంకులపై తీవ్ర ప్రభావం చూపింది. భారత్, చైనా సహా చాలా దేశాలపై ఈ ప్రభావం పడింది. ఇప్పటికే తలసరి జీడీపీలో ఈ క్యాలెండర్ ఏడాదిలో భారత్‌ను బంగ్లాదేశ్ దాటుతుందని అంచనాలు వెల్లడయ్యాయి. 2021 నాటికి తిరిగి భారత్... బంగ్లాదేశ్‌ను అధిగమిస్తుందని అదే అంచనాలు చెబుతున్నాయి. ఈ సమయంలో బ్యాంకుల పనితీరుపై కూడా డేటా వెలుగుచూడటం గమనార్హం.

కరోనా దెబ్బతో వెనుకడుగు

కరోనా దెబ్బతో వెనుకడుగు

ఇదివరకు 25 శాతం ఆధిక్యంలో ఉన్న భారత్ ఇప్పుడు వెనుకబడిందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కఠినమైన ఆర్థిక లేదా ద్రవ్యవిధానం అవసరమని సూచిస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం తలసరి జీడీపీలో భారత్‌ను బంగ్లాదేశ్ దాటనుంది. 2020లో బంగ్లాదేశ్ 4 శాతం వృద్ధితో 1,888 డాలర్లకు చేరుకుంటే, భారత తలసరి జీడీపీ 10.5 శాతం క్షీణించి 1877 డాలర్లకు క్షీణించనుంది. గత నాలుగేళ్లలో ఇది కనిష్టం.

English summary

ఆ భారత బ్యాంకుల వరస్ట్ పర్ఫార్మెన్స్, బంగ్లాదేశ్ బ్యాంకులు అదుర్స్! | Indian banks log the worst total returns in Q3: Bangladeshi lenders shine

Smaller banks from Bangladesh, Pakistan and China emerged as the best-performing banking stocks in Q3 2020, while its Indian peers logged the worst total returns, according to data by S&P Markets Intelligence.
Story first published: Thursday, October 15, 2020, 20:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X