For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Fraud: లవర్ కోసం బ్యాంక్ సొమ్ము స్వాహా..! బెంగళూరులో మేనేజర్ అరెస్ట్.. డేటింగ్ యాప్..

|

Bank Fraud: డేటింగ్ యాప్‌లో పరిచయమైన తన ప్రియురాలికి రూ.5.7 కోట్లు మళ్లించారనే ఆరోపణలపై బెంగళూరు హనుమంతనగర్‌లోని ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్‌ను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఫిర్యాదుతో మేనేజర్ హరిశంకర్‌ను 10 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

వారిపైనా కేసు నమోదు..

వారిపైనా కేసు నమోదు..

దీనికి తోడు శంకర్ సహోద్యోగులలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కౌసల్య జెరాయ్, క్లర్క్ మునిరాజును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో అనుమానితులుగా నమోదు చేశారు. అనుమానిత మోసం మే 13- మే 19 మధ్య జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. డేటింగ్ యాప్‌ని ఉపయోగించి తనను మోసగించిన ఆన్‌లైన్ స్కామర్ల వల్ల డబ్బు పోగొట్టుకున్నానని, పోలీసులు తన బ్యాంక్ ట్రాన్సాక్షన్ల స్టేట్‌మెంట్లను తనిఖీ చేస్తున్నారని శంకర్ చెప్పారు.

అసులు జరిగింది ఇది..

అసులు జరిగింది ఇది..

ఓ మహిళా కస్టమర్ తన పేరు మీద రూ.1.3 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, ఆ మొత్తాన్ని తాకట్టు పెట్టి రూ.75 లక్షల రుణం పొందినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కస్టమర్ అవసరమైన కాగితాలను అందించాడు. అయితే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది దానిని తారుమారు చేసి తాకట్టు ద్వారా రూ. 5.7 కోట్లను ఓవర్‌డ్రాఫ్ట్‌ రూపంలో అనేక విడతలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు అంతర్గత విచారణ జరిపిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని వివిధ బ్యాంకుల్లోని 28 ఖాతాలకు, కర్ణాటకలోని రెండు ఖాతాలకు 136 లావాదేవీల ద్వారా నగదు బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. శంకర్‌ సహోద్యోగుల్లో ఇద్దరిని అక్రమంగా పనిలో పెట్టుకుని మోసానికి పాల్పడినట్లు అనుమానం రావడంతో వారిని కూడా ప్రశ్నిస్తున్నారు.

బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్..

బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్..

ఈ లావాదేవీలు జరగడానికి ముందు హరిశంకర్ రూ.12.5 లక్షల వ్యక్తిగత నిధులను ఖాతాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. రూ.7 లక్షలను అక్రమంగా బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ ను ఇండియన్ బ్యాంక్ స్తంభింపజేసింది.

English summary

Bank Fraud: లవర్ కోసం బ్యాంక్ సొమ్ము స్వాహా..! బెంగళూరులో మేనేజర్ అరెస్ట్.. డేటింగ్ యాప్.. | indian bank manager Bengaluru banker arrested for diverting Rs 5.7 crore to girlfriend illegally

bank farud busted in bangalore of karnataka bank manager was arrested as investigation going
Story first published: Sunday, June 26, 2022, 18:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X