భారత ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దకాలంలో ఎంతో ముందుకు వెళ్తుందని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (CEBR) తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఆరవ స్థానంలో ఉన్న భారత్, 2025 నాటికి బ్రిటన్‌ను అధిగమించి అయిదో స్థానానికి, 2030లో జపాన్‌ను అధిగమించి మూడో స్థానానికి చేరుకోవచ్చునని తెలిపింది. 2027 నాటికి జర్మనీని అధిగమిస్తుందని పేర్కొంది. కరోనా కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, అందుకే తన స్థానాన్ని బ్రిటన్‌కు కోల్పోయిందని, 2024 నాటికి అదే స్థానంలో ఉండి, 2025 నాటికి ఆ దేశాన్ని భారత్ అధిగమించగలదని తెలిపింది.

అందుకే బ్రిటన్‌కు చేజారింది..
బలహీన రూపాయి కారణంగా బ్రిటన్ ఈ ఏడాది తిరిగి తన స్థానాన్ని భారత్ నుండి తీసుకోగలిగిందని CEBR నివేదిక తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ 2021లో 9 శాతం, 2022లో 7 శాతం మేర నమోదు చేయవచ్చునని అంచనా వేసింది. ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందినప్పుడు సాధారణంగా వృద్ధి మందగిస్తుందని, 20.35లో భారత వార్షిక వృద్ధి రేటు 5.8 శాతానికి తగ్గవచ్చునని తెలిపింది.

ఇది కాస్త ఊరట
కరోనా భారత్‌లో మానవ, ఆర్థిక నష్టాలను మిగిల్చిందని, అమెరికా, ఐరోపాతో పోలిస్తే మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది కాస్త ఊరటను ఇచ్చే అంశమని వెల్లడించింది. లాక్ డౌన్‌ను క్రమంగా ఎత్తివేశాక ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు తిరిగి పుంచుకున్నాయని, ఉత్పత్తి మాత్రం కరోనా కంటే ముందుస్థాయితో పోలిస్తే తక్కువగా ఉందని తెలిపింది. వ్యవసాయ రంగం ముందుకు నడిపిస్తోందని వెల్లడించింది. దేశంలో వ్యాక్సీన్ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం 5.5 కోట్ల మందికి టీకాలు ఇస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందని తెలిపింది.

అమెరికాను దాటనున్న చైనా
2028లో అమెరికాను వెనక్కి నెట్టి చైనా ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గతంలోని అంచనాతో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే ఇది జరుగుతోందని వెల్లడించింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకునే విషయంలో రెండు దేశాల మధ్య అసమానతలే ఇందుకు కారణమని వెల్లడించింది. మరో 10 సంవత్సరాలు జపాన్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుందని వెల్లడించింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications