For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధరలు తగ్గనున్నాయా?: అమెరికా చికెన్‌పై భారీగా తగ్గనున్న దిగుమతి సుంకం

|

ఢిల్లీ: అగ్రదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే చికెన్‌పై భారత్ టారిఫ్‌ను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై 100 శాతం పన్ను ఉంది. దీనిని 30 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ టారిఫ్ తగ్గింపు అంశంపై పశు సంవర్ధక మంత్రిత్వ శాఖతో వాణిజ్య శాఖ చర్చలు జరిపిందట. అమెరికాలో చికెన్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చికెన్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికన్లు లెగ్ పీస్‌లు ఇష్టపడరు. వాటిని భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో వాటిని భారత్‌కు ఎగుమతి చేసేందుకు అమెరికా మొగ్గు చూపింది.

మోడీ ప్రభుత్వం అనుమతించాలి..

మోడీ ప్రభుత్వం అనుమతించాలి..

అమెరికా లెగ్ పీసులను భారత్ దిగుమతి చేసుకునే అంశంపై పౌల్ట్రీ పరిశ్రమ వ్యతిరేకంగా ఉంది. భారతీయ చికెన్ పరిశ్రమ వ్యాల్యూ రూ.1 లక్ష కోట్ల వరకు ఉంటుంది. దీని ద్వారా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు. అమెరికా చికెన్‌ను దిగుమతి చేసుకుంటే ఇక్కడి చికెన్ పరిశ్రమపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో దిగుమతికి మోడీ ప్రభుత్వం అనుమతించవలసి ఉంటుంది.

అమెరికా చికెన్‌కు ఆదరణ ఉండదా?

అమెరికా చికెన్‌కు ఆదరణ ఉండదా?

సాధారణంగా భారతీయులు ఎప్పటికి అప్పుడు కోసిన చికెన్‌ను ఇష్టపడతారు. భద్రపరిచిన చికెన్ పైన ఆసక్తి చూపించరు. అమెరికా నుంచి వచ్చే చికెన్‌కు సమయం తీసుకుంటుంది. కాబట్టి దానిని చెడిపోకుండా శీతలీకరించి తీసుకు వస్తారు. ఇలా భద్రపరిచిన చికెన్‌ను భారతీయులు ఎక్కువ మంది ఇష్టపడరని చెబుతున్నారు. దిగుమతి సుంకాన్ని 100 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలనే అంశంపై ప్రభుత్వ సమాలోచనలు జరుపుతోంది. దీనిని మాత్రం పౌల్ట్రీ పరిశ్రమ వ్యతిరేకిస్తోంది. మరోవైపు, అమెరికన్ చికెన్ పైన దిగుమతి సుంకం తగ్గిస్తే ఇక్కడ పోటీ పెరిగి ధరలు తగ్గడం, కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.

లక్షలాది మందికి ఉపాధి

లక్షలాది మందికి ఉపాధి

భారత్‌లో పౌల్ట్రీ పరిశ్రమ వ్యాల్యూ 1 ట్రిలియన్ డాలర్లు. దీని ద్వారా 4 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో 2 మిలియన్ల మంది పౌల్ట్రీ రైతులు. 88 బిలియన్ల కోడిగుడ్లు, 4 బిలియన్ యూనిట్ల బ్రాయిలర్ (1.8 కిలో నుంచి 2 కిలో) కోళ్లతో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉండగా, అమెరికా మూడో స్థానంలో ఉంది.

English summary

ధరలు తగ్గనున్నాయా?: అమెరికా చికెన్‌పై భారీగా తగ్గనున్న దిగుమతి సుంకం | India to reduce import duties on US broiler Chickens?

India may reduce import duties on US broiler Chickens soon. Sources said that talks between India and the US are in an advanced stage to sign the treaty, which would force India to cut import duty to 30 per cent from the existing 100 per cent on chicken imports from the US.
Story first published: Sunday, November 3, 2019, 9:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X