For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియాలో భారత ఎకానమీ జెట్ స్పీడ్‌తో.. చైనా కంటే ఎక్కువ: కానీ సవాళ్ళు ఎన్నో...

|

కరోనా కారణంగా ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి. 2021లో ఆసియా దేశాల్లో వేగంగా వృద్ధి నమోదు చేసే భారత్ ముందు ఉందని తాజాగా జపనీస్ బ్రోకరేజీ సంస్థ నోమురా తెలిపింది. వచ్చే క్యాలెండర్ ఏడాదిలో భారత్ వృద్ధి రేటు 9.9 శాతంగా నమోదు కానుందని అంచనా వేస్తోంది. చైనా జీడీపీ వృద్ధి రేటు 9 శాతంగా, సింగపూర్ జీడీపీ 7.5 శాతంగా అంచనా వేస్తున్నారు.

Year Ender 2020: దారుణ పతనం నుండి గోడకు కొట్టిన బంతిలా...Year Ender 2020: దారుణ పతనం నుండి గోడకు కొట్టిన బంతిలా...

2021లో వృద్ధి రేటు ఇలా..

2021లో వృద్ధి రేటు ఇలా..

2021 క్యాలెండర్ ఏడాదిలో భారత వృద్ధి రేటు పాజిటివ్‌గా ఉంటుందని నోమురా తెలిపింది. రికవరీ వేగంగా పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. భారత జీడీపీ వృద్ధి రేటు 2021 మొదటి త్రైమాసికం(జనవరి-మార్చి)లో మైనస్ 1.2 శాతంగా ఉంటుందని, రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 32.4 శాతం వృద్ధిని నమోదు చేయనుందని నోమురా అంచనా వేసింది. మూడో త్రైమాసికం (సెప్టెంబర్ క్వార్టర్)లో 10.2 శాతం, నాలుగో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) 4.6 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేస్తోంది. మొత్తంగా 2021 క్యాలెండర్ ఏడాదిలో 9.9శాతంగా ఉండవచ్చునని తెలిపింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో మైనస్ 7.1 శాతంగా అంచనా వేసింది.

వృద్ధి సరే.. సవాళ్లు ఎన్నో

వృద్ధి సరే.. సవాళ్లు ఎన్నో

2021-22(FY22) ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 11.9 శాతంగా ఉండవచ్చునని తెలిపింది. 2020-21 (FY21) ఆర్థిక సంవత్సరంలో మైనస్ 8.2 శాతంగా అంచనా వేసింది. ఆసియా 2021 ఔట్ లుక్ పేరుతో నోమురా ఆసియా దేశాల వృద్ధి రేటు అంచనాలను విడుదల చేసింది. ఫిచ్ రేటింగ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును మైనస్ 9.4 శాతానికి సవరించింది. అయితే, భారత్ ముందు సవాళ్లు కూడా ఉన్నట్లు తెలిపింది. K షేప్ రికవరీ కనిపిస్తోందని తెలిపింది. అసంఘటిత రంగంలో రికవరీ నెమ్మదిగా ఉందని పేర్కొంది. రికవరీ ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్యను లేవనెత్తింది. తక్కువ తలసరి ఆదాయం, అధిక అసమానతలు, అధిక జనాభా నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి, సామాజిక ఉద్రిక్తత వంటి సవాళ్లను పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు వంటి వాటిని ప్రస్తావించింది.

వివిధ దేశాల వృద్ధి రేటు అంచనా...

వివిధ దేశాల వృద్ధి రేటు అంచనా...

2020, 2021, 2022లలో వివిధ దేశాల వృద్ధి రేటుపై నోమురా అంచనా వరుసగా ఇలా ఉంది. ఆస్ట్రేలియా -2.8 శాతం, 3.8 శాతం, 3.3 శాతం, చైనా -.1 శాతం, 9.0 శాతం, 5.3 శాతం, హాంగ్‌కాంగ్ -6.1 శాతం, 4.3 శాతం, 3.2 శాతం, ఇండియా -7.1 శాతం, 9.9 శాతం, 5.0 శాతం, సింగపూర్ -5.2 శాతం, 3.6 శాతం, 3.9 శాతం ఉన్నాయి. 2020 క్యాలెండర్ ఏడాదిలో అన్ని దేశల వృద్ధి మైనస్‌లలో ఉండగా, 2021లో ప్లస్‌లోకి వెళ్లింది.

English summary

ఆసియాలో భారత ఎకానమీ జెట్ స్పీడ్‌తో.. చైనా కంటే ఎక్కువ: కానీ సవాళ్ళు ఎన్నో... | India to be the fastest growing Asian economy in 2021

India could well be the fastest-growing Asian economy in calendar year 2021 (CY21) if Nomura’s forecasts are to be believed. The foreign research and brokerage house expects the Indian economy – as measured by gross domestic product (GDP) – to grow at 9.9 per cent in 2021, eclipsing China (2021 GDP growth pegged at 9 per cent) and Singapore (at 7.5 per cent) during this period.
Story first published: Thursday, December 10, 2020, 9:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X