For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ ప్రభుత్వానికి ఊరట: పట్టణాల్లో నిరుద్యోగం తగ్గింది

|

న్యూఢిల్లీ: నిరుద్యోగ అంశంపై శుభవార్త! గత కొన్నాళ్లుగా ఆర్థిక మందగమనం ప్రభావం వల్ల ఉద్యోగాల కోత ఆందోళన కలిగిస్తోంది. అయితే పట్టణాల్లో 2019 జనవరి - మార్చి మధ్య నిరుద్యోగిత రేటు తగ్గింది. పట్టణ నిరుద్యోగ రేటు 4 త్రైమాసికాల్లో అతి తక్కువ స్థాయికి (9.3 శాతం) చేరుకుందని జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) పేర్కొంది. అంతకుముందు ఏడాది ఏప్రిల్ - జూన్ నెలలో నిరుద్యోగ రేటు 9.9% నమోదైంది. 2018లో జనవరి-మార్చి కాలంలో నిరుద్యోగ రేటు వివరాలు గణాంకాల్లో లేవు.

మారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీమారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీ

2018లో నిరుద్యోగ రేటు

2018లో నిరుద్యోగ రేటు

గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జనవరి-మార్చి 2019 కాలానికి త్రైమాసిక బులెటిన్లో పట్టణ ఉపాధి, ప్రామాణికాలపై అంచనాలతో ఈ గణాంకాలు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ రేటు గత ఏడాది (2018) ఏప్రిల్ - జూన్ 9.9% నమోదైంది. జూలై - సెప్టెంబర్‌లో 9.7%, అక్టోబర్ - డిసెంబర్‌లో 9.9% నమోదైంది. నాలుగు త్రైమాసికాల్లోనే పట్టణ నిరుద్యోగ రేటు 9.3 శాతానికి తగ్గింది.

పురుషుల నిరుద్యోగ రేటు

పురుషుల నిరుద్యోగ రేటు

2019 జనవరి - మార్చిలో పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగ రేటు 8.7% నమోదైంది. 2018 ఏప్రిల్ - జూన్‌లో ఇది 9%, జూలై - సెప్టెంబర్‌లో 8.9% అక్టోబర్ - డిసెంబర్‌లో 9.2% నమోదయింది. మహిళల నిరుద్యోగ రేటు 2019 జనవరి - మార్చిలో 11.6%, 2018 ఏప్రిల్ - జూన్‌లో 12.8%, జూలై - సెప్టెంబర్‌లో 12.7%, అక్టోబర్ - డిసెంబర్‌లో 12.3% నమోదైంది.

స్వయం ఉపాధి..

స్వయం ఉపాధి..

మొత్తం కార్మికుల్లో... 37.7% మంది స్వయం ఉపాధి కలిగిన వారు ఉన్నారు. 50% వేతన జీవులు లేదా రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. 12.4% మంది సాధారణ కార్మికులు ఉన్నారు. 2017-18లో 45 ఏళ్లలో ఎప్పుడూలేని విధంగా దేశంలో లేబర్ ఫోర్స్‌లో నిరుద్యోగ రేటు 6.1% నమోదయింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

English summary

మోడీ ప్రభుత్వానికి ఊరట: పట్టణాల్లో నిరుద్యోగం తగ్గింది | India's Urban Unemployment Rate Drops to Over 9.3% in January March

The urban unemployment rate in the country fell to 9.3 per cent during January-March 2019 from 9.8 per cent in April-June 2018, government data showed on Saturday.
Story first published: Sunday, November 24, 2019, 10:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X