For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రత్యక్ష పన్ను వసూళ్లు 100% జంప్, ఏప్రిల్ 1 నుండి జూన్ 15 వరకు రూ.1.85 లక్షల కోట్లు

|

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1.85 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అయినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏడాది క్రితం ఇదే సమయంలో వసూలైన వాటితో పోలిస్తే ఇది 100 శాతం అధికం. ఏప్రిల్ 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు ఈ వసూళ్లు ఉన్నాయి. దీంట్లో కార్పోరేట్ ఆదాయ పన్ను కింద రూ.74,356 కోట్లు వసూలు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) కింద రూ.1.11 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి.

ఏప్రిల్ 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు ఏడాది క్రితం వసూలైన రూ.92,762 కోట్లతో పోలిస్తే రెండింతలు అని సీబీడీటీ వెల్లడిచింది. అలాగే రీఫండ్స్ రూ.30,731 కోట్లుగా నమోదయ్యాయి.

Indias net direct tax collections so far this fiscal rise to Rs 1.85 lakh crore

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.16 లక్షల కోట్లు కాగా, గత ఏడాది ఇదే కాలంతో చూస్తే రూ.1.37 లక్షల కోట్ల నుండి 57 శాతం పెరిగాయి. ఇందలో కార్పొరేట్ పన్నులు రూ.96,923 కోట్లు. వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. రిఫండ్స్ తర్వాత నికర వసూళ్లు వరుసగా రూ.74,356 కోట్లు, రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నాయి.

English summary

ప్రత్యక్ష పన్ను వసూళ్లు 100% జంప్, ఏప్రిల్ 1 నుండి జూన్ 15 వరకు రూ.1.85 లక్షల కోట్లు | India's net direct tax collections so far this fiscal rise to Rs 1.85 lakh crore

Government Net direct tax collections doubled to more than Rs1.85 lakh crore for the financial year 2021-22.
Story first published: Thursday, June 17, 2021, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X