ఇండియాకు గతంలో రద్దు చేసిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP)ను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు భారత్‌తో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. GSPకి ప్రతిగా ఇండియా నుండి సరైన ప్రతిపాదనలు వస్తే పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడతాయని తెలిపింది. భారత్ అధిక టారిఫ్ విధిస్తోందనే వివిధ కారణాలతో అమెరికా గతంలో GSP హోదాను తొలగించింది. ఇప్పుడు చైనాతో వాణిజ్య అమెరికాకు వాణిజ్య యుద్ధం ముదరడం, భారత్ అవసరం నేపథ్యంలో అమెరికా దీనిని పరిశీలిస్తున్నట్లుగా భావిస్తున్నారు.

యాపిల్ సహా భారత్ సుంకాలు పెంచింది... అందుకే
యాపిల్ పండ్ల పైన భారత్ 70 శాతం సుంకాలు విధిస్తోందని వాషింగ్టన్‌కు చెందిన ఓ ప్రతినిధి చట్టసభలో మాట్లాడుతూ ఆరోపించారు. దీని నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలని అడిగారు. దీనికి మరో ప్రతినిధి స్పందిస్తూ పప్పు దినుసులపై కూడా భారత్ సుంకాలు పెంచిందని, దీంతో అమెరికా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. వీటన్నింటికి భారత్‌కు జీఎస్పీ రద్దు చేయడం వల్ల కలుగుతున్న నష్టమని అభిప్రాయపడ్డారు.

నష్టపోతున్నాం.. అందుకే జీఎస్పీని పునరుద్ధరించే ప్రయత్నం
దీనిపై వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటైజర్ స్పందిస్తూ.. జీఎస్పీ పునరుద్ధరణ దిశగా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, జీఎస్పీ రద్దుకు ప్రతిగా భారత్ అధిక సుంకాలు విధించిందని, దీంతో మన రైతులకు నష్టం జరుగుతోందని, ఇప్పుడు దీనిని తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగాను అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

భారత్ ప్రతీకారం.. దెబ్బతీసింది
జీఎస్పీ హోదాను రద్దు చేసినందుకు భారత్ ప్రతీకారంగా ట్యాక్స్ పెంచిందని, ఇవి భారంగా మారాయని అభిప్రాయపడ్డారు. పప్పు దినుసుల విషయంలోనూ చాలా ఘోరమైన టారిఫ్ విధిస్తోందన్నారు. పలువురు ప్రతినిధులు సుంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications