For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2.986 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు, గోల్డ్ నిల్వలు జంప్

|

భారత ఫారెక్స్ నిల్వలు (విదేశీ మారకపు) మార్చి 26వ తేదీతో ముగిసిన వారానికి 298.6 కోట్ల డాలర్ల మేర తగ్గి 57,928.5 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు(FCA) 322.6 కోట్ల డాలర్లు తగ్గి 53,795.3 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గోల్డ్ నిల్వలు 27.6 కోట్ల డాలర్ల మేర పెరిగి 3,490.7 కోట్ల డాలర్లకు చేరాయి.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) వద్ద మన SDR 90 లక్షల డాలర్ల మేర తగ్గి 149 కోట్ల డాలర్లకు, నిల్వల స్థితి 2.7 కోట్ల డాలర్లు తగ్గి 493.5 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఈ ఏడాది జనవరి 29వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చారిత్రక గరిష్ఠస్థాయి 59,018.5 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

Indias forex reserves fall by $2.986 billion to $579.285 billion

కాగా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్‌లో ఇటీవల రష్యాను అధిగమించింది భారత్. తద్వారా ప్రపంచ నాలుగో దేశంగా నిలిచింది. సౌత్ ఏషియా దేశాల సెంట్రల్ బ్యాంకు పెట్టుబడుల ఉపసంహరణ చర్యలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థని పరిరక్షించడానికి డాలర్లను నిల్వ చేయడంతో భారత్ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది పెట్టుబడులు వేగంగా పెరిగిన అనంతరం ఇరుదేశాల మారక నిల్వలు దాదాపు సమానమయ్యాయి.

అయితే ఇటీవల రష్యా కంపెనీల్లో పెట్టుబడులు వేగంగా తగ్గడంతో మారక నిల్వల్లో భారత్ ముందుకు వచ్చింది. ఫలితంగా ప్రపంచం విదేశీ మారక నిల్వల్లో భారత్ నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఇప్పుడు భారత్ నిల్వలు కాస్త తగ్గాయి.

English summary

2.986 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు, గోల్డ్ నిల్వలు జంప్ | India's forex reserves fall by $2.986 billion to $579.285 billion

The country's foreign exchange reserves declined by $2.986 billion to reach $579.285 billion in the week ended March 26, RBI data showed on Friday. In the previous week ended March 19, the forex kitty had increased by $233 million to $582.271 billion. It had touched a record high of $590.185 billion in the week ended January 29, 2021.
Story first published: Saturday, April 3, 2021, 9:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X