For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యాను దాటిన భారత్, విదేశీ మారక నిల్వల్లో ప్రపంచ నాలుగో దేశంగా..

|

ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్‌లో రష్యాను అధిగమించింది భారత్. తద్వారా ప్రపంచ నాలుగో దేశంగా నిలిచింది. సౌత్ ఏషియా దేశాల సెంట్రల్ బ్యాంకు పెట్టుబడుల ఉపసంహరణ చర్యలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థని పరిరక్షించడానికి డాలర్లను నిల్వ చేయడంతో భారత్ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది పెట్టుబడులు వేగంగా పెరిగిన అనంతరం ఇరుదేశాల మారక నిల్వలు దాదాపు సమానం అయ్యాయి. అయితే ఇటీవల రష్యా కంపెనీల్లో పెట్టుబడులు వేగంగా తగ్గడంతో మారక నిల్వల్లో భారత్ ముందుకు వచ్చింది. ఫలితంగా ప్రపంచం విదేశీ మారక నిల్వల్లో భారత్ నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది.

మార్చి 5వ తేదీ నాటికి భారత ఫారెక్స్ హోల్డింగ్స్ 4.3 బిలియన్ డాలర్లు తగ్గి 580.3 బిలియన డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ ఇటీవల తెలిపింది. రష్యా 580.1 బిలియన్ డాలర్ల మారక నిల్వలు కలిగి ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం విదేశీ మారక నిల్వల్లో మొదటి స్థానంలో చైనా ఉంది. ఆ తర్వాత జపాన్ రెండో స్థానంలో, స్విట్జర్లాండ్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు 18 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ నిల్వలు ఉన్నాయి.

Indias foreign exchange reserves surpass Russias, become world’s fourth biggest

అరుదైన కరెంట్ అకౌంట్ మిగులు, స్థానిక స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడుల పెరుగుదల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా రావడంతో మారక నిల్వలు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు బలమైన విదేశీ మారక నిల్వలతో విదేశీ పెట్టుబడిదారులకు, క్రెడిట్ రేటింగ్ కంపెనీలకు ప్రభుత్వం రుణ బాధ్యతలను తీర్చగలదు.

English summary

రష్యాను దాటిన భారత్, విదేశీ మారక నిల్వల్లో ప్రపంచ నాలుగో దేశంగా.. | India's foreign exchange reserves surpass Russia's, become world’s fourth biggest

Currently, in the International Monetary Fund table, China has the largest reserves, followed by Japan and Switzerland.
Story first published: Monday, March 15, 2021, 17:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X