For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ డెబ్డ్ ETF: రిటైల్ భాగస్వామ్యం కోసం...

|

నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్ మార్కెట్‌ను మరింత విస్తరించడంతో పాటు ఇందులోకి రిటైల్ భాగస్వామ్యాన్ని తీసుకు వచ్చేందుకు తొలిసారి బాండ్ ETF ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. బుధవారం (డిసెంబర్ 4) కేంద్ర ప్రభుత్వం భారత్ బాండ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు పచ్చ జెండా ఊపింది. దీనిని ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తుంది. ప్రభుత్వం, స్టేక్ హోల్డర్స్‌తో రెండేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం దీనిని తీసుకు వచ్చారు.

ఇది తొలి కార్పోరేట్ బాండ్ ETF అని, ఇది ప్రభుత్వరంగ బ్యాంకుల (PSU)తో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధులను సమకూరుస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

Indias first debt ETF is here! Retail investors can now bet on bonds

భారత్ బాండ్ ETF మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ పీరియడ్ కలిగి ఉంటాయి. యూనిట్స్ స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్ అవుతాయి. ETF AAA- రేటెడ్ సంస్థలను కలిగి ఉంటుంది. భారత్ బాండ్ ETF యూనిట్ వ్యాల్యూ రూ.1,000గా ఉంటుంది.

ఈ పథకం ద్వారా రెండు ఎంపిక చేసుకోవచ్చు. ఒకటి మూడేళ్లు (2023), రెండోది పదేళ్లు (2030). గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది. డివిడెండ్ ఆప్షన్ లేదు. ఈ బాండ్స్‌ను డిసెంబర్‌లో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

English summary

ఫస్ట్ డెబ్డ్ ETF: రిటైల్ భాగస్వామ్యం కోసం... | India's first debt ETF is here! Retail investors can now bet on bonds

The Modi government on Wednesday cleared the launch of India’s first bond ETF in a bid to deepen the bond market and bring in retail participation in this space.
Story first published: Wednesday, December 4, 2019, 16:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X