For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

cough syrup: ఇండియా - 'ఫార్మసీ ఆఫ్‌ ద వరల్డ్' ప్రతిష్ట మసకబారుతోంది...

|

cough syrup: దేశీయ దగ్గు సిరప్‌ల కారణంగా ఉజ్బెకిస్తాన్, గాంబియాలో పిల్లలు మరణించారన్న ఆరోపణలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయ ఫార్మా ఎగుమతులపై ఈ వార్తలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని.. ఇటీవల ఓ సమీక్షా సమావేశంలో వాణిజ్యశాఖ కార్యదర్శి అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్:

ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్:

తక్కువ ధరకు, నాణ్యమైన మందులను అందజేస్తున్న భారత ఫార్మా ఎగుమతులకు ఈ తరహా వార్తలు తీవ్ర నష్టం కలగజేస్తాయి. 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్'‌గా అంతర్జాతీయ విపణిలో మన దేశానికున్న ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది' అని ఆరోగ్యశాఖకు, ఫార్మాసూటికల్స్ విభాగం సెక్రటరీకి రాసిన లేఖలో వాణిజ్యశాఖ కార్యదర్శి అభిప్రాయపడ్డారు. గాంబియా, ఉజ్బెకిస్థాన్ మార్కెట్లలో భారత ఫార్మా రంగానికి మంచి గిరాకీ ఉండగా.. ఆయా దేశాలకు భవిష్యత్తు ఎగుమతుల విషయమై తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

 స్పందనేదీ..?

స్పందనేదీ..?

ఈ ఘటనలపై వాణిజ్యశాఖకు చెందిన ఎగుమతుల విభాగం అప్‌డేట్స్‌ కోరుతున్నా.. 'సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ (CDSCO)', 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌' నుంచి ఎటువంటి ఖచ్చితమైన సమాధానం రాలేదని వాణిజ్య శాఖ తన లేఖలో పేర్కొంది. పరిశోధనల ఫలితాలు, దగ్గుమందు నాణ్యత, భవిష్యత్తులో ఈ తరహా సమస్యల నియంత్రణకు ప్రతిపాదించిన చర్యలను తెలియచేయాలని కోరింది.

తయారీ భారత్‌లో కాదు:

తయారీ భారత్‌లో కాదు:

ఆరోపణలు ఎదుర్కొంటున్న మారియన్ బయోటెక్‌పై.. రాష్ట్ర మరియు కేంద్ర డ్రగ్‌ నియంత్రణ సంస్థలు డిసెంబరు 27న దాడులు నిర్వహించాయి. ఔషధం ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చాయి. ఇందుకు సంబంధించి నమూనాలను సేకరించగా.. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. కాగా ఈ ఔషధం ఇండియాలో తయారు కావడం లేదని, కేవలం ఇక్కడ నుంచి ఎగుమతి మాత్రమే చేస్తున్నట్లు ఆల్‌ఇండియా ఆరిజిన్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అక్టోబర్‌లోనే స్పందించడం గమనార్హం.

అసలు వివాదమేంటి ?

అసలు వివాదమేంటి ?

భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న దగ్గు సిరప్ కారణంగా గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారంటూ అక్టోబర్‌లో వివాదం చెలరేగింది. అనంతరం డిసెంబరులో ఉజ్బెకిస్తాన్‌లోనూ ఇదే తరహా వార్తలు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ విషయాలపై స్పందించి, నివేదిక సమర్పించాలని కోరింది.

English summary

cough syrup: ఇండియా - 'ఫార్మసీ ఆఫ్‌ ద వరల్డ్' ప్రతిష్ట మసకబారుతోంది... | India's fame fading in pharma exports

Commerce secretary letter to health ministry over cough syrup issue
Story first published: Sunday, January 15, 2023, 7:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X