సెప్టెంబర్‌లో కరెంట్ అకౌంట్ సర్‌ప్లస్ 2.4%, రూ.1,13,439 తగ్గిన మిగులు
న్యూఢిల్లీ: 2020-21 రెండో త్రైమాసికం జూలై-సెప్టెంబర్ నాటికి దేశీయ కరెంట్ ఖాతా మిగులు 15.5 బిలియన్ డాలర్ల (రూ.1,13,439 కోట్ల)కు తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (GDP)లో ఇది 2.4 శాతానికి సమానం. తొలి త్రైమాసికంలో 10.8 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు రెండో త్రైమాసికంలో 14.8 బిలియన్ డాలర్ల(రూ.1,08,231 కోట్ల)కు పెరిగినందున
కరెంట్ ఖాతా మిగులు తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ ప్రకటనలో తెలిపింది.
2020లో కంపెనీలకు 568 శాతం లాభం, అయినా భారీగా ఉద్యోగాలు కట్

కరెంట్ ఖాతా మిగులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో కరెంట్ ఖాతా మిగులు 19.2 బిలియన్ డాలర్లు (GDPలో 3.8 శాతం)గా, 2019-20 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 7.6 బిలియన్ డాలర్లు(GDPలో 1.1 శాతం)గా ఉంది. గత ఆర్థిక సంవత్సర మొదటి అర్ధ సంవత్సరంలో దేశీయ కరెంట్ ఖాతాలో లోటు నమోదైంది. అది జీడీపీలో 1.6 శాతానికి సమానం.

భారతీయుల చెల్లింపులు
ఇక, ప్రయివేటు ట్రాన్సుఫర్ రిసిప్ట్‌లు విదేశాల్లో పని చేసే భారతీయుల చెల్లింపులను సూచిస్తాయి. 2020-21 రెండో త్రైమాసికంలో వరుసగా 12 శాతం పెరిగి 20.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. నికర సర్వీసెస్ రిసిప్ట్స్ పెరిగాయి. ప్రధానంగా కంప్యూటర్ సేవల నుండి పెరిగాయి. ఆర్థిక ఖాతాలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుడులు సెప్టెంబర్ త్రైమాసికంలో 24.6 బిలియన్ డాలర్లతో బలమైన ప్రవాహాన్ని నమోదు చేశాయి. మొదటి త్రైమాసికంలో ఇది 0.8 బిలియన్ డాలర్లుగా ఉంది.

రికవరీ వల్ల
దేశీయ రికవరీ బలోపేతం కావడంతో కరెంట్ అకౌంట్ మిగులు రెండో అర్ధ సంవత్సరానికి 5 బిలియన్ డాలర్లకు తగ్గవచ్చునని ఇక్రా రేటింగ్స్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అన్నారు. పెరుగుతున్న కరోనాను నివారించేందుకు విధించిన ఆంక్షల కారణంగా లాజిస్టిక్ సవాళ్లు, ఎగుమతలకు ఆటంకం కలిగిందని తెలిపారు.