For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్‌పై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కీలక వ్యాఖ్యలు

|

ఇటీవలి వరకు భారీగా ఎగిసిపడిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఇప్పుడు పడిపోతోంది. ఇప్పటికే ప్రభుత్వం క్రిప్టోకరెన్సీని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో భారత మార్కెట్లో దీని వ్యాల్యూ తగ్గుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బిట్ కాయిన్ వ్యాల్యూ ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టం 58,332 డాలర్లతో 17 శాతం పడిపోయింది. ఎలాన్ మస్క్ కామెంట్లకు తోడు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ వ్యాఖ్యల నేపథ్యంలో బిట్ కాయిన్ 45వేల డాలర్లకు పడిపోయింది.

దేశీయ అతిపెద్ద ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూడా క్రిప్టోకరెన్సీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెగ్యులేటర్స్ ముందుకు వచ్చి బిట్ కాయిన్‌ను నిషేధించాలని, తాను ఎప్పుడు కూడా బిట్ కాయిన్‌ను కొనుగోలు చేసేది లేదన్నారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిషేధం వ్యాఖ్యల ప్రభావం క్రిప్టోకరెన్సీ పైన పడింది.

India’s Bitcoin owners get sinking feeling as Jhunjhunwala calls for its ban

కాగా, టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన చేసిన ట్వీట్ కారణంగా దీని వ్యాల్యూ పడిపోవడంతో పాటు ఆయన సంపద కూడా కరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రిప్టో వ్యాల్యూపై అనుమానాలు రావడంతో ఏకంగా 17 శాతం క్షీణించి 45,000 డాలర్లకు పడిపోయింది. గతవారం ఓ సమయంలో 58వేల డాలర్లు దాటిన బిట్ కాయిన్ ఇప్పుడు 45వేల స్థాయికి పడిపోవడం గమనార్హం.

English summary

బిట్ కాయిన్‌పై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కీలక వ్యాఖ్యలు | India’s Bitcoin owners get sinking feeling as Jhunjhunwala calls for its ban

For the Bitcoin investors in India, the ground is shrinking beneath their feet. Or so it seems.
Story first published: Wednesday, February 24, 2021, 17:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X