For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సమయంలోను భారత్‌లోకి భారీగా పెట్టుబడులు

|

కరోనా సంక్షోభ కాలంలోను భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) భారీగా వచ్చాయని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అన్నారు. గత ఇరవై నెలల్లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరినట్లు తెలిపారు. యూకేలో జరుగుతున్న సీఐఐ సమావేశంలో ఆయన వర్చువల్ మార్గంలో ప్రసంగించారు. రక్షణ, అంతరిక్ష, అణుశక్తి వంటి తదితర రంగాల్లో భారీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. పన్నుల విధింపుల్లో పారదర్శకత పాటిస్తున్నట్లు తెలిపారు.

జీఎస్టీ, ఆధార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతుల అభివృద్ధి, విమానాశ్రయాల అభివృద్ధి, వ్యవసాయ రంగంలో సంస్కరణలు వంటి అంశాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారి సమయంలోను సత్ఫలితాలు ఇచ్చాయని, ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయనేందుకు ఇదే నిదర్శనం అన్నారు. 2019లో అంతర్జాతీయంగా ఎఫ్‌డీఐలు ఒక శాతం క్షీణించగా, భారత్‌కు 20 శాతం పెరిగాయన్నారు. గూగుల్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.

కేంద్రమంత్రి చెప్పింది నిజమే: టయోటా నో.. తర్వాత రూ.2000 కోట్ల పెట్టుబడి, ఎందుకు, ఏం జరిగింది?కేంద్రమంత్రి చెప్పింది నిజమే: టయోటా నో.. తర్వాత రూ.2000 కోట్ల పెట్టుబడి, ఎందుకు, ఏం జరిగింది?

India received dollar 20 billion in FDI during Covid pandemic

గూగుల్ 10 బిలియన్ డాలర్లు, ఫేస్‌బుక్ 5 బిలియన్ డాలర్లు, ముబాదాల 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు వచ్చినట్లు చెప్పారు. ప్రపంచంలో ఓపెన్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ముందు ఉందని చెప్పారు. యూకే, భారత్ ద్వైపాక్షిక సంబంధాల గురించిమాట్లాడుతూ.. 2019లో ద్వైపాక్షిక వాణిజ్యం 24 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపారు.

English summary

కరోనా సమయంలోను భారత్‌లోకి భారీగా పెట్టుబడులు | India received dollar 20 billion in FDI during Covid pandemic

India has received over USD 20 billion in FDI amid the coronavirus pandemic, Foreign Secretary Harsh Vardhan Shringla said on Tuesday, showcasing the country as one of the most attractive destinations for investment globally.
Story first published: Wednesday, September 16, 2020, 18:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X