For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాబోయే రోజుల్లో భారత్ మంచి మార్కెట్ .. వ్యాపారాన్ని విస్తరిస్తాం అంటున్న కేఎఫ్‌సీ

|

భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని కేఎఫ్‌సీ భావిస్తోంది . అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సంస్థ కెంటకీ ఫ్రైడ్ చికెన్ భారతదేశంలో తమ రెస్టారెంట్ వ్యాపార నెట్వర్క్ ను విస్తరింపజేయాలని ఆలోచనలో ఉంది. రాబోయే సంవత్సరాల్లో దేశం వృద్ధి మార్కెట్‌గా ఉంటుందని తాము నమ్ముతున్నానని అమెరికా ఆధారిత ఫాస్ట్ ఫుడ్ సంస్థ కేఎఫ్‌సీ స్పష్టం చేసింది.

భారీగా లాభపడిన టాటా గ్రూప్ షేర్లు .. సైరస్ మిస్త్రీ తొలగింపుపై సుప్ర్రీం తీర్పు ఎఫెక్ట్భారీగా లాభపడిన టాటా గ్రూప్ షేర్లు .. సైరస్ మిస్త్రీ తొలగింపుపై సుప్ర్రీం తీర్పు ఎఫెక్ట్

 కరోనా సమయంలోనూ 30 రెస్టారెంట్లను ఏర్పాటు చేసిన కేఎఫ్‌సీ

కరోనా సమయంలోనూ 30 రెస్టారెంట్లను ఏర్పాటు చేసిన కేఎఫ్‌సీ

కరోనా మహమ్మారి సృష్టించిన ఇబ్బందికర పరిణామాల మధ్య కూడా గరిష్ట సమయంలో గత ఏడాది సుమారు 30 కొత్త రెస్టారెంట్లను ప్రారంభించిన కెఎఫ్‌సి ఇండియా, ఈ సంవత్సరం కూడా కొత్త ఔట్‌లెట్లను పెట్టాలని చూస్తోంది. భారతదేశంలో వినియోగదారులు కేఎఫ్ సి చికెన్ పై ఎక్కువగా మక్కువ చూపిస్తున్న నేపథ్యంలో ఇండియా మార్కెట్ లో బిజినెస్ బాగా సాగుతుందని భావిస్తోంది . ఖచ్చితంగా బ్రాండ్‌ను విస్తరింప చేయాలని భావిస్తున్నామని, అంతేకాదు కస్టమర్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ మా బ్రాండ్ విలువ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నామని కెఎఫ్‌సి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనన్ అన్నారు.

 భారత్ లో కేఎఫ్‌సీ కి భలే డిమాండ్ ... కరోనా సమయంలోనూ జోరుగా వ్యాపారం

భారత్ లో కేఎఫ్‌సీ కి భలే డిమాండ్ ... కరోనా సమయంలోనూ జోరుగా వ్యాపారం

కరోనా మహమ్మారి గత ఏడాది మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరోనా కు ముందు ఉన్న రెస్టారెంట్లు కంటే, ప్రస్తుతం ఎక్కువ రెస్టారెంట్లను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా రెస్టారెంట్ లు పెట్టినా భారత్లో డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణకు ముందు, కె ఎఫ్ సి ఇండియాలో రెస్టారెంట్ల సంఖ్య 450 గా ఉంది మరియు ప్రస్తుతం భారతదేశంలోని 130 కి పైగా నగరాల్లో 480 కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. అంటే కరోనా సమయంలో 30 రెస్టారెంట్లను అదనంగా ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు .

ఆన్ లైన్ , ఆఫ్ లైన్ సర్వీసులను అందిస్తున్న కేఎఫ్‌సీ.. రాబోయే రోజుల్లో మంచి మార్కెట్

ఆన్ లైన్ , ఆఫ్ లైన్ సర్వీసులను అందిస్తున్న కేఎఫ్‌సీ.. రాబోయే రోజుల్లో మంచి మార్కెట్

కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ కేఎఫ్ సి ఆన్లైన్ వ్యాపారం కనీసం 50 శాతం పెరిగిందని చెప్పారు. అయితే కరోనాకు మందు తో పోల్చి చూస్తే ప్రస్తుతం రెస్టారెంట్లకు కస్టమర్లు తక్కువగా వస్తున్నారని, ముందు ముందు పుంజుకునే అవకాశం ఉందని, పూర్వ స్థితికి చేరుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాలలో కచ్చితంగా కె ఎఫ్ సి కి భారత్ మంచి మార్కెట్ అవుతుందనే విషయం లో తమకు ఎలాంటి సందేహం లేదన్నారు.

 ఈ ఏడాది మరో 25 రెస్టారెంట్ లు ఏర్పాటు ఆలోచనలో కేఎఫ్‌సీ

ఈ ఏడాది మరో 25 రెస్టారెంట్ లు ఏర్పాటు ఆలోచనలో కేఎఫ్‌సీ

కరోనా కేసులు పెరిగి ఔట్ లెట్లు తాత్కాలికంగా మళ్ళీ మూసివేసినప్పటికీ తమ కస్టమర్లకు ఆన్లైన్ సర్వీసులను అందిస్తామని, కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ, ఆహారభద్రత ,పరిశుభ్రత, కాంటాక్ట్ లెస్ డెలివరీ లతో తమ సర్వీస్ ను అందిస్తామని కేఎఫ్ సి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనన్ అన్నారు. ఈ ఏడాది మరో 25 రెస్టారెంట్ లు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ ఆర్డర్‌లు అందించటంలో, అలాగే రెస్టారెంట్లలో వినియోగదారులలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పు తీసుకురావడంతో, మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడంలో కెఎఫ్‌సి ఇండియా తన ప్రయత్నాలను వేగవంతం చేసిందని ఆయన అన్నారు.

Read more about: kfc india business
English summary

రాబోయే రోజుల్లో భారత్ మంచి మార్కెట్ .. వ్యాపారాన్ని విస్తరిస్తాం అంటున్న కేఎఫ్‌సీ | India is a good market in the coming days .. KFC says it will expand the business

U.S.-based fast food chain Kentucky Fried Chicken (KFC) will continue to expand its restaurant network in India despite the coronavirus pandemic bringing structural changes in the business, believing the country to be a growth market in the coming years, according to a top company official.
Story first published: Monday, March 29, 2021, 19:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X