For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు అదుర్స్: అమెరికా, సింగపూర్‌లలో ఎక్కువ..

|

సాధారణంగా మన దేశంలోకి వచ్చే పెట్టుబడుల గురించి ఎప్పటికి అప్పుడు వింటూనే ఉంటాం. మన దేశానికి చెందిన వారు లేదా కంపెనీలు విదేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలల్లో కార్పోరేట్ ఇండియా 12.25 బిలియన్ డాలర్ల మేర విదేశాల్లో పెట్టుబడులు పెట్టింది. విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. భారత కంపెనీలకు సంబంధించి విదేశీ పెట్టుబడులపై కేర్ రేటింగ్స్ పలు అంశాలు వెల్లడించింది.

అమ్మో! 2020... 2021లో కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి: కొత్త ఏడాదిపై వారి ధీమాఅమ్మో! 2020... 2021లో కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి: కొత్త ఏడాదిపై వారి ధీమా

ఈ రూపంలో వెళ్లాయి

ఈ రూపంలో వెళ్లాయి

కేర్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం FY20లో దేశీయ కంపెనీల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (FDI)లు 13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదే సమయంలో మన దేశంలోకి వచ్చిన FDIలు 76 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ - నవంబర్ కాలంలో 12.25 బిలియన్ డాలర్ల FDIలు బయటి దేశాల్లోకి వెళ్లాయి. వాస్తవ ఔట్-ఫ్లో 6.35 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో 2.97 బిలియన్ డాలర్లు ఈక్విటీస్, 3.38 బిలియన్ డాలర్లు లోన్ కమిట్మెంట్ రూపంలో వెళ్లాయి మిగతా 5.90 బిలియన్ డాలర్లు గ్యారంటీ రూపంలో ఉన్నాయి.

దేశంలోకి పెట్టుబడులు

దేశంలోకి పెట్టుబడులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో FDIల రాకడ 35.73 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో (31.60 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే 13 శాతం ఎక్కువ. ఇందులో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరంలో 76 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇందులో 18 బిలియన్ డాలర్లు సర్దుబాటు, 56 బిలియన్ డాలర్లు డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి.

అమెరికా, సింగపూర్‌లలో ఎక్కువగా..

అమెరికా, సింగపూర్‌లలో ఎక్కువగా..

FY20లో దాదాపు 13 బిలియన్ డాలర్ల అమెరికా, సింగపూర్ సహా వివిధ దేశాల్లోకి మన FDIలు వెళ్లాయి. 2012-13 నుండి వరుసగా రెండో ఏడాది డబుల్ డిజిట్ సాధించింది. అయితే FY09లో 19 బిలియన్ డాలర్లు, FY08 18 బిలియన్ డాలర్లు ఇప్పటి వరకు అత్యధికం. విదేశాల్లోకి వెళ్లే FDIలో ఎక్కువగా ఫైనాన్షియల్స్, ఇన్సురెన్స్, బిజినెస్ సర్వీసెస్ ఉన్నాయి. వీటి వాటా 3.89 బిలియన్ డాలర్లు. మ్యానుఫ్యాక్చరింగ్ 3.45 బిలియన్ డాలర్లు, అగ్రికల్చరల్ అండ్ మైనింగ్ 1.90 బిలియన్ డాలర్లు, హోల్ సేల్ అండ్ రిటైల్ 1.73 బిలియన్ డాలర్లుగా ఉంది.

English summary

విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు అదుర్స్: అమెరికా, సింగపూర్‌లలో ఎక్కువ.. | India Inc's overseas investments at USD 12.25 billion during April-November

Corporate India has invested USD 12.25 billion overseas during the first eight months of the current fiscal, most of which has gone into the firms' wholly-owned subsidiaries in the US, Singapore or the Netherlands, according to data collated by Care Ratings.
Story first published: Saturday, December 19, 2020, 8:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X