మనం ఎక్కడ ఉండాలి? ఏ ఉద్యోగం చేయాలి? అనే విషయాలను నిర్ణయించడంలో ఆ నగరం యొక్క జీవన వ్యయం (Cost of Living) కీలక పాత్ర పోషిస్తుంది. 2026 మార్చి నాటికి అందిన తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశంలోని మెట్రో నగరాల్లో బ్రతకడం మునుపటి కంటే కొంచెం భారంగానే మారింది. ముఖ్యంగా ఐటీ రంగంలో దూసుకుపోతున్న బెంగళూరు (Bengaluru), ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) వంటి నగరాల్లో ఖర్చులు చుక్కలు చూపిస్తున్నాయి.
మెట్రో నగరాల మధ్య పోటీ
జీవన వ్యయ సూచిక (Cost of Living Index) ప్రకారం చూస్తే.. ముంబై ఇప్పటికీ దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఇక్కడ అద్దెలు, రవాణా ఖర్చులు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. మరోవైపు, గార్డెన్ సిటీ, ఐటీ హబ్ అయిన బెంగళూరు కూడా ఈ జాబితాలో పైస్థానంలోనే ఉంది. అయితే మీరు ఒక వ్యక్తిగా ఒంటరిగా ఉన్నారా? లేదా కుటుంబంతో ఉంటున్నారా? అనే దానిపై మీ నెలవారీ బడ్జెట్ ఆధారపడి ఉంటుంది.

నెలవారీ ఖర్చుల అంచనా
నెంబియో (Numbeo) డేటా ప్రకారం, 2026లో అద్దె మినహాయించి ఒక సగటు భారతీయుడు నెలకు సుమారు రూ. 27,300 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నలుగురు సభ్యులున్న కుటుంబం అయితే ఈ మొత్తం రూ. 98,000 వరకు చేరుకుంటుంది. ఇందులో మనం రోజువారీ కొనే పాలు, కూరగాయలు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ , రవాణా ఖర్చులు కలిసి ఉంటాయి.
నగరాల వారీగా ఒకసారి పరిశీలిస్తే..
- ముంబై: ఇక్కడ ఒక వ్యక్తికి నెలకు రూ. 30,000 నుండి రూ. 60,000 వరకు (అద్దెతో కలిపి) అవసరమవుతాయి.
- బెంగళూరు: ఇక్కడ టెక్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కాబట్టి, సగటు ఖర్చు రూ. 20,000 నుండి రూ. 50,000 మధ్యలో ఉంటుంది.
- హైదరాబాద్: మెట్రో నగరాల్లో అత్యంత సరసమైన వాటిలో ఒకటిగా హైదరాబాద్ నిలుస్తోంది. ఇక్కడ రూ. 12,000 నుండి రూ. 50,000 లోపు జీవించవచ్చు.
- ఢిల్లీ (Delhi): దేశ రాజధానిలో జీవన వ్యయ సూచిక 22.5గా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తికి అద్దె కాకుండా నెలకు రూ. 22,000 నుండి రూ. 50,000 వరకు ఖర్చవుతుంది. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే అత్యంత చౌకైన రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది.
- పుణె (Pune): ఐటీ, ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న పుణెలో జీవన వ్యయ సూచిక 22.4. ఇక్కడ ఒక వ్యక్తి నెలవారీ ఖర్చు రూ. 25,000 నుండి రూ. 45,000 మధ్యలో ఉంటుంది. హైదరాబాద్ తర్వాత మెరుగైన 'పర్చేసింగ్ పవర్' ఉన్న నగరం ఇదే.
- చెన్నై (Chennai): దక్షిణ భారత మెట్రో నగరాల్లో చెన్నైలో ఖర్చులు తక్కువ (సూచిక 20.0). ఇక్కడ ఒక వ్యక్తికి నెలకు రూ. 15,000 నుండి రూ. 50,000 వరకు అవసరమవుతాయి. అద్దె సూచిక కూడా కేవలం 4.4గా ఉండటం గమనార్హం.
- కోల్‌కతా (Kolkata): ప్రధాన మెట్రో నగరాలన్నింటిలోకి కోల్‌కతా అత్యంత చౌకైనది (సూచిక 19.3). ఇక్కడ ఇంటి అద్దెలు చాలా తక్కువగా ఉంటాయి. నెలకు రూ. 20,000 నుండి రూ. 40,000 ఉంటే ఒక వ్యక్తి ఇక్కడ రాజాలా బ్రతికేయవచ్చు.
అద్దెలు ఎక్కడ ఎక్కువ?
మెట్రో నగరాల్లో జేబుకు చిల్లు పెట్టేది ప్రధానంగా ఇంటి అద్దెలే. ముంబైలో 1BHK అద్దె సగటున రూ. 65,000 వరకు ఉండగా.. బెంగళూరు (Bengaluru) లో ఇది రూ. 28,000 స్థాయిలో ఉంది. కానీ, లక్నో లేదా జైపూర్ వంటి టైర్-2 నగరాల్లో కేవలం రూ. 10,000 నుండి రూ. 12,000 కే మంచి ఇల్లు దొరుకుతుంది. అందుకే చాలా మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఉంటే చిన్న నగరాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఏ నగరం బెటర్?
కేవలం ఖర్చులు మాత్రమే కాకుండా, మనం సంపాదించే జీతం అక్కడ ఎంతవరకు సరిపోతుందో కూడా చూసుకోవాలి. హైదరాబాద్ , పుణె నగరాల్లో కొనుగోలు శక్తి ఎక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అంటే మీరు ముంబై, బెంగళూరు లో పొందే సౌకర్యాల కంటే తక్కువ ఖర్చుతో హైదరాబాద్ లో మెరుగైన జీవనశైలిని పొందవచ్చు.
చివరిగా చెప్పాలంటే, 2026లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, మీ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకునేటప్పుడు ఈ నగరాల వారీ ఖర్చుల లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

Bengaluru: గ్యాస్ కొరత సాకుతో అదనపు బాదుడు.. వైరల్ అవుతున్న బెంగళూరు కేఫ్ బిల్లు!

Bengaluru: బెంగళూరు పవర్ ప్లాంట్ బంద్.. కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

Bengaluru: నెలకు రూ. 1.5 లక్షల జీతం.. చేతిలో మిగిలేది ఇంతే! బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

Bengaluru: వారం రోజుల్లో బెంగళూరు పీజీల్లో గ్యాస్ ఖాళీ..! ప్రభుత్వం ఏం చేయబోతోంది?

Hyderabad: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్!

Bengaluru: రూ. 2 కోట్ల ఉద్యోగం వద్దు.. ఫాలోవర్లే ముద్దు! వైరల్ అవుతున్న టెక్కీ స్టోరీ!

హైదరాబాద్‌లో గ్యాస్ సంక్షోభం.. రెండు రోజుల్లో రూ.50 కోట్లు నష్టం.. ఇంకా ఆందోళనకర అంశం ఏంటంటే..

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..

Hyderabad: హైదరాబాదే దేశంలో సురక్షితమైన నగరం.. బెంగళూరు, ఢిల్లీ పై రేవంత్ రెడ్డి సెటైర్లు!

Gold rates: క్రూడాయిల్ ఎఫెక్ట్.. పసిడి మార్కెట్లో ఒడిదుడుకులు, తులం బంగారం ఎంతంటే?



Click it and Unblock the Notifications