For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా, చైనా తర్వాత భారత్: నెలకు మూడు యూనికార్న్స్

|

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టం‌గా భారత్ అవతరించింది. అమెరికా, చైనా తర్వాత భారత్ నిలవడంతో పాటు సమీప భవిష్యత్తులో మందగించే పరిస్థితులు కనిపించడంలేదు. గత ఏడాది కాలంగా భారత్ నుండి ప్రతి నెల మూడు యూనికార్న్స్ వస్తున్నాయి. మొత్తం యూనికార్న్స్ 51గా నమోదయ్యాయి. యూకేలో 32, జర్మనీలో 18 నమోదయ్యాయి. 1 బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన స్టార్టప్ కంపెనీని యూనికార్న్‌గా పేర్కొంటారు. ఈ జాబితాలో అమెరికా 396 యూనికార్న్స్‌తో మొదటి స్థానంలో నిలువగా, 277 యూనికార్న్స్‌తో చైనా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ యూనికార్న్స్ వ్యాల్యూ 168 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది తెలంగాణ రాష్ట్ర జీడీపీ కంటే ఎక్కువ.

యూనికార్న్స్‌తో పాటు ఫ్యూచర్ యూనికార్న్స్ అంటే గాజిల్స్, చీథాస్ కూడా భారత్‌లో పెరుగుతున్నట్లు హూరున్ ఇండియా నివేదిక చెబుతోంది. అయితే నిబంధనల పరంగా సౌకర్యంగా ఉండటంతో, ఇతర దేశాల్లో స్థిరపడేందుకు కొన్ని యూనికార్న్స్ మొగ్గు చూపుతున్నాయని తెలిపింది. 50 కోట్ల డాలర్లకు పైన వ్యాల్యూ కలిగిన స్టార్టప్స్ ప్రస్తుతం 32 ఉండగా, ఇవి రెండేళ్లలో యూనికార్న్స్‌గా అవతరిస్తాయి. 20 కోట్ల డాలర్ల విలువైన 54 కంపెనీలు నాలుగేళ్లలో యూనికార్న్స్‌గా మారవచ్చు. భవిష్యత్తులో యూనికార్న్స్‌గా మారే సంస్థల వ్యాల్యూ దాదాపు 3,600 కోట్ల డాలర్లు.

 India becomes third largest startup ecosystem in the world

ఇలాంటి సంస్థలు బెంగళూరు నుండి 31, ఢిల్లీ నుండి 18, ముంబై నుండి 13 వచ్చాయి. ఐఐటీ, ఐఐఎం నుండి పట్టా పుచ్చుకున్న యువత విజయవంతమైన స్టార్టప్స్ వ్యవస్థాపకులుగా ఎదుగుతున్నారు. వీరిలో ఐఐటీ ఢిల్లీ నుండి 17 మంది, ఐఐటీ బాంబే నుండి 15 మంది, ఐఐటీ కాన్పూర్ నుండి 13 మంది, ఐఐఎం అహ్మదాబాద్ నుండి 13 మంది ఉన్నారు. ఇలాంటి సంస్థల వ్యవస్థాపకుల్లో ముప్పై ఏళ్ల లోపు వారు 11 మంది, యాభై ఏళ్ల లోపు వారు 15 మంది ఉన్నారు.

భారత్‌లో ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 60 కోట్లు కాగా, 2025 నాటికి 90 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది స్టార్టప్స్‌కు మరింత ఊతమిస్తుంది. భారత్‌లో ప్రారంభమైన కొన్ని స్టార్టప్స్ ఇక్కడి నిబంధనల కారణంగా అమెరికాకు తరలి వెళ్లాయి. ఇక, హూరున్ ఇండియా భవిష్యత్ యూనికార్న్స్ జాబితాలోని కంపెనీల్లో అధిక పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో సిఖోయా (37), టైగర్ గ్లోబల్ (18) ఉన్నాయి.

ఇక రెండు నుండి నాలుగేళ్లలో యూనికార్న్స్‌‌గా అవతరించే అవకాశమున్న పది స్టార్టప్స్‌లో (హూరున్ ఇండియా జాబితా ప్రకారం) జిలింగో, మొబైల్ ప్రీమియర్ లీగ్, రెబెల్ ఫుడ్స్ క్యూర్ ఫిట్, స్పిన్నీ, రెట్ గెయిన్, మామా ఎర్త్, కార్ దేఖో, గ్రే ఆరెంజ్, మొబిక్విక్ ఉన్నాయి. వీటి వ్యాల్యూ ప్రస్తుతం 36 బిలియన్ డాలర్లుగా ఉందని, గత ఎనిమిది నెలల్లో ఐదు స్టార్టప్స్ చీతా హోదా నుండి నేరుగా యూనికార్న్ స్థాయికి ఎదిగాయని హూరున్ ఇండియా ఎండీ, ప్రధాన పరిశోధకులు జునైద్ అన్నారు. మొబైల్ పేమెంట్స్, బీమా, బ్లాక్ చైన్, స్టాక్ ట్రేడింగ్, డిజిటల్ లెండింగ్ స్టార్టప్స్‌కు మంచి అవకాశాలున్నాయని చెప్పారు.

English summary

అమెరికా, చైనా తర్వాత భారత్: నెలకు మూడు యూనికార్న్స్ | India becomes third largest startup ecosystem in the world

India has emerged as the third largest startup ecosystem in the world after the US and China and the pace of growth is not showing any signs of slowing down.
Story first published: Friday, September 3, 2021, 21:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X