For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా టైంలో భారత్‍‌లోకి పెద్దఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

|

కరోనా మహమ్మారి సమయంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) భారీగా పెరిగాయి. దేశంలోకి రూ.22 బిలియన్ డాలర్లు వచ్చినట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. మన దేశ FDI విధానం ఎంత సరళంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ మొత్తంలో 90 శాతం ఆటోమేటిక్ మార్గంలో వచ్చినవేనని చెప్పారు. కరోనా సమయంలోను FDIలు పెద్ద ఎత్తున రావడం గమనార్హం.

అర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి.. ముఖేష్ అంబానీ వరల్డ్ టాప్ 4, జుకర్‌బర్గ్‌ను దాటి 3వ స్థానం దిశగా..!అర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి.. ముఖేష్ అంబానీ వరల్డ్ టాప్ 4, జుకర్‌బర్గ్‌ను దాటి 3వ స్థానం దిశగా..!

ప్రపంచంలోనే సరళవిధానం

ప్రపంచంలోనే సరళవిధానం

ప్రపంచంలోని అత్యంత సరళవంత FDI విధానం భారత దేశానిదేనని అమితాబ్ కాంత్ చెప్పారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడాన్ని కొనసాగించామని, కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో 22 బిలియన్ డాలర్లకు పైగా ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఐఐ నిర్వహించిన ఇండియా@75 వర్చువల్ ఈవెంట్‌లో వెల్లడించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్ 50లోకి వెళ్తాం

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్ 50లోకి వెళ్తాం

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోను భారత్ ప్రపంచంలో 79వ స్థానానికి ఎగబాకిందని అమితాబ్ కాంత్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మనం టాప్ 50లోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ట్రాన్సాఫార్మ్ చెందాలంటే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ వంటివి అవసరమని అభిప్రాయపడ్డారు. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్‌ను జనవరి 2018లో లాంచ్ చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన 112 జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా దీనిని ప్రారంభించారు.

ఆన్‌లైన్ వివాద పరిష్కారం

ఆన్‌లైన్ వివాద పరిష్కారం

బలమైన ఆన్‌లైన్ వివాద పరిష్కారం (ODR)తో తక్కువ ఖర్చు, వేగం, నమ్మదగిన రీతిలో న్యాయం జరిగేలా ఉంటుందని అమితాబ్ కాంత్ అన్నారు. ఇది వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు సహాయపడుతుందన్నారు. ODR అనేది వేగంగా వృద్ధి చెందుతున్న వివాద పరిష్కార యంత్రాంగం.

English summary

కరోనా టైంలో భారత్‍‌లోకి పెద్దఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు | India attracts USD 22 billion FDI during COVID-19

India's FDI regime is the most liberal in the world, and even during the COVID-19 pandemic, the country has attracted over USD 22 billion worth of direct investments, Niti Aayog CEO Amitabh Kant said on Saturday.
Story first published: Sunday, August 9, 2020, 20:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X