న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయలేదా? మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉందని ఆందోళన చెందుతున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఇదివరకు పలుమార్లు ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించారు. డిసెంబర్ 31, 2020 వరకు క్రితంసారి అవకాశం ఇచ్చారు. మరోసారి పొడిగింపు ఉండదని ఇటీవల సంకేతాలు ఇచ్చారు. అయితే అనేక విజ్ఞప్తుల నేపథ్యంలో ఒకసారి పొడిగింపు అవకాశమిచ్చారు. అలాగే, మరో పొడిగింపు ఉండదనే సంకేతాలు ఇచ్చారు.
తాజాగా, జనవరి 10, 2021 వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది కేంద్రం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను జనవరి 10వ తేదీ వరకు పొడిగించడం ద్వారా మరో పది రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. అలాగే, కంపెనీల ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును 15 రోజులు పెంచింది. ఫిబ్రవరి 15వ తేదీలోపు రిటర్న్స్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

కాగా, డిసెంబర్ 28వ తేదీవరకు 4.54 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. వివాద్ సే విశ్వాస్ గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications