For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tax Payers: ఆదాయపు పన్ను చెల్లించేవారే టార్గెట్.. SBI తాజా హెచ్చరిక.. బీ కేర్ ఫుల్..

|

Income Tax Payers: దొంగలకు దారులు కొదవా అన్నట్లుగా మారింది సైబర్ నేరగాళ్ల పరిస్థితి. అయితే ఈ సారి వాళ్లు ఏకంగా టాక్స్ చెల్లింపుదారులను టార్గెట్ చేశారు. అవును ఇందుకోసం Drinik అనే ఫిషింగ్ టెక్నిక్ ఉపయోగించి దాడులు చేస్తున్నట్లు వెల్లడైంది.

డ్రినిక్ మాల్వేర్..

డ్రినిక్ మాల్వేర్..

ప్రస్తుతం మాల్వేర్ ఆండ్రాయిడ్ ట్రోజన్‌గా రూపాంతరం చెందిందని.. ఇది కస్టమర్ల బ్యాకింగ్ పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారం వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఇది కొత్త వెర్షన్ ఓవర్‌లే అసాల్ట్‌లు, కీలాగింగ్, స్క్రీన్ రికార్డింగ్, యాక్సెసిబిలిటీ సర్వీస్ దుర్వినియోగాన్ని చేయగలదు. దీనివల్ల వినియోగదారుల కీలక సమాచారం సత్కరించబడుతుంది.

డ్రినిక్ అంటే ఏమిటి..?

"Drinik అనేది ఫిషింగ్ దాడుల ద్వారా కస్టమర్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ (PII), బ్యాంకింగ్ ఆధారాలను దొంగిలించడానికి భారతీయ పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకున్న మాల్వేర్ అని SBI తన ట్వీట్ లో కస్టమర్లకు వెల్లడించింది. దీనితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే ఇప్పటికే కొంత మంది ఎస్బీఐ వినియోగదారులు ఇలా మోసపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంక్ తన కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేసింది.

కస్టమర్‌లను ఎలా టార్గెట్ చేస్తుంది?

కస్టమర్‌లను ఎలా టార్గెట్ చేస్తుంది?

డ్రినిక్ మాల్వేర్ తాజా వెర్షన్ iAssist అనేది APK రూపంలో వస్తుందని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ హెచ్చరించింది. iAssist అనేది భారతదేశ పన్ను శాఖ అధికారిక పన్ను నిర్వహణ సాధనం. ఆండ్రాయిడ్ ట్రోజన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత పన్ను చెల్లింపుదారుల కాల్ వివరాలు, ఎస్ఎమ్ఎస్ వివరాలను తస్కరిస్తుందని తెలిపింది. అందువల్ల యాక్సెసిబిలిటీ సర్వీస్‌ని ఎనేబుల్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. తద్వారా గూగుల్ పే రక్షణ బ్రీచ్ చేయబడుతుంది. డ్రినిక్ తాజా వెర్షన్‌లో TA చట్టబద్ధమైన ఆదాయపు పన్ను సైట్ ఖాతాలతో బాధితులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఆ తర్వాత లాగిన్ కాగానే మీరు రూ.57,100 తక్షణ పన్ను రీఫండ్‌కు అర్హులంటూ ఎరవేస్తుంది. ఆ సమయంలో బ్యాంకిగ్ వివరాలతో పాటు ఇతర ఆధార్, పాన్ వివరాలను కోరుతుంది.

డ్రినిక్ మాల్వేర్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి?

డ్రినిక్ మాల్వేర్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి?

Step 1: Play Store నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.

Step 2: యాప్‌లలో, లాక్ స్క్రీన్‌లో బయోమెట్రిక్ ప్రమాణీకరణ భద్రతను ప్రారంభించండి.

Step 3: తెలియని నంబర్ల నుంచి మీరు అందుకున్న లింక్‌లపై అస్సలు క్లిక్ చేయవద్దు.

Step 4: Google Play ప్రొటెక్ట్ ఉపయోగించి మీ ఫోన్ లో హానికరమైన యాప్స్, డివైజ్ లను తనిఖీ చేయండి.

Step 5: మీ Android ఫోన్‌లో యాప్ అనుమతులను మార్చండి: మీ ఫోన్‌లో కెమెరా లేదా కాంటాక్ట్స్ లిస్ట్ వంటి వివిధ ఫీచర్‌లను ఉపయోగించడానికి మీరు కొన్ని యాప్‌లకు మాత్రమే అనుమతిని ఇవ్వవచ్చు. అలా ఫోన్ లోకి మాల్ వేర్ రాకుండా కాపాడుకోవచ్చు.

Read more about: income tax tax refund sbi drinik
English summary

Tax Payers: ఆదాయపు పన్ను చెల్లించేవారే టార్గెట్.. SBI తాజా హెచ్చరిక.. బీ కేర్ ఫుల్.. | Income Tax Payers Were Targeted By Drinik malware banks Cautioning Customers

Income Tax Payers Were Targeted By Drinik malware banks Cautioning Customers..
Story first published: Saturday, November 5, 2022, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X