For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Credit Score: కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా..? క్రెడిట్ స్కోర్ ఇలా బిల్డ్ చేసుకోండి..

|

Build Credit Score: కొత్త లోన్ కోసం మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఫైనాన్స్ కంపెనీ తిరస్కరించడానికి తక్కువ CIBIL స్కోర్ కలిగి ఉండటం ఒక కారణం. ఎందుకంటే.. CIBIL లేదా క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ యోగ్యతను నిర్ణయించే కీలకాంశాల్లో ఒకటని గుర్తుంచుకోండి. ఇది మీకు లోన్ ఇవ్వాలా వద్దా అనే దానిని నిర్ణయిస్తుంది. కాబట్టి.. సులువుగా, సరసమైన వడ్డీ రేట్లకు లోన్ పొందేందుకు తక్కువ క్రెడిట్ స్కోర్ పెద్ద అడ్డంకి అని చెప్పుకోవాలి.

క్రెడిట్ బ్యూరోలు ఎలా లెక్కిస్తాయి..

క్రెడిట్ బ్యూరోలు ఎలా లెక్కిస్తాయి..

క్రెడిట్ బ్యూరోలు ఎప్పటికప్పుడు మీ చెల్లింపు క్రమశిక్షణ, క్రెడిట్ మిక్స్, క్రెడిట్ వినియోగం, క్రెడిట్ హిస్టరీ వంటి అంశాల ఆధారంగా మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కిస్తాయి. మీ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్‌పై ఆమోదం పొందడానికి, బెస్ట్ డీల్స్ పొందడానికి CIBIL స్కోర్ చాలా కీలకమైనదని గుర్తుంచుకోండి. మంచి క్రెడిట్ స్కోర్ ఎలా నిర్మించికోవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ చిట్కాలను విజయవంతంగా ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి..

క్రెడిట్ కార్డ్‌ని పొందండి:

క్రెడిట్ కార్డ్‌ని పొందండి:

మీరు కొత్తగా క్రెడిట్ కార్డును తీసుకుంటున్నట్లయితే క్రెడిట్ స్కోర్ నిర్మించుకోవటంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఇలా క్రెడిట్ స్కోర్ నిర్మించుకోవటం చాలా సులువైన మార్గం కూడా. క్రెడిట్ హిస్టరీ లేకపోతే అన్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను పొందటం చాలా కష్టం.అటువంటి సందర్భాల్లో.. సురక్షితమైన క్రెడిట్ కార్డ్ తో ముందుకెళ్లటం మంచి మార్గం. అటువంటి క్రెడిట్ కార్డ్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి కొలేటరల్ ద్వారా కస్టమర్లకు అందించబడుతుంది. ఈ కార్డ్‌లు అన్ సెక్యూర్డ్ కార్డ్‌ల మాదిరిగానే పని చేస్తాయి. మీకు రివార్డ్ పాయింట్‌లు, మినహాయింపులు, EMI మార్పిడి సౌకర్యాలు వీటిలో కూడా అందుబాటులో ఉంటాయి. కార్డు తీసుకునేటప్పుడు అన్ని ఛార్జీల గురించి తెలుసుకోవటంతో పాటు సమయానికి పూర్తి బిల్లులను చెల్లించాలని గుర్తుంచుకోండి.

 ఒకేసారి అనేక క్రెడిట్ అప్లికేషన్స్ వద్దు:

ఒకేసారి అనేక క్రెడిట్ అప్లికేషన్స్ వద్దు:

మీకు స్కోర్ లేకుంటే లేదా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే.. మీ క్రెడిట్ అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం ఉంది. దీని వల్ల మీరు ఇతర ఫైనాన్స్ కంపెనీల వద్ద మళ్లీ దరఖాస్తులు చేయటం మానుకోవాలి. లేకుండే అది మీ క్రెడిట్ స్కోర్ ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. తక్కువ సమయంలోనే అనేక క్రెడిట్ ఎంక్వైరీలు చేయటం మీ క్రెడిట్ స్కోర్ ను తాత్కాలికంగా తగ్గిస్తుందని గుర్తుంచుకోండి. ఎక్కువ క్రెడిట్ కార్డులకు లేదా లోన్స్ కోసం దరఖాస్తులు చేయటం మీకు ఎక్కువ క్రెడిట్ అవసరం ఉందని క్రెడిట్ బ్యూరోలకు సూచిస్తుంది. ఇది మీకు తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తుంది.

కుటుంబ సభ్యుల క్రెడిట్ కార్డులకు:

కుటుంబ సభ్యుల క్రెడిట్ కార్డులకు:

మీ తల్లిదండ్రులు లేదా ఇతరులకు ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డ్‌కు మీరు అధీకృత వినియోగదారుగా జాయిన్ అవ్వటం మంచిది. అసలు క్రెడిట్ స్కోర్ లేని వారికి మంచి క్రెడిట్ హిస్టరీ బుల్డ్ చేసుకోవటానికి ఇది మంచి మార్గం. అధీకృత వినియోగదారుగా.. మీరు ప్రధాన ఖాతాదారుని క్రెడిట్ ప్రొఫైల్‌లో పిగ్గీబ్యాక్ చేయవచ్చు. కార్డ్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించవచ్చు. ఈ సందర్భంలో మీ చర్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. అవి మీ క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే కాకుండా ప్రధాన ఖాతాదారుని క్రెడిట్ స్కోర్ ని కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ పద్ధతిలో మీరు సురక్షితమైన క్రెడిట్ హిస్టరీని క్రియేట్ చేసుకుని మంచి క్రెడిట్ స్కోర్ పొందవచ్చు.

 మీ క్రెడిట్ కార్డ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించండి:

మీ క్రెడిట్ కార్డ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించండి:

మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని పొందిన తర్వాత.. దాన్ని బాగా ఉపయోగించుకోండి. క్రమం తప్పకుండా ఉపయోగించడం, సకాలంలో తిరిగి చెల్లించడం క్రెడిట్ స్కోర్‌ను నిర్మించడానికి అవసరమైన క్రెడిట్ చరిత్రను నిర్మించడంలో మీకు సహాయం చేస్తుంది. ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు క్రెడిట్ హిస్టరీ నిర్మించడమే కాకుండా సకాలంలో తిరిగి చెల్లించే అలవాటును కూడా పొందవచ్చు. ఇదే సమయంలో మీరు క్రెడిట్ లిమిట్ లో 30 శాతం మాత్రమే వినియోగించుకోండి. దీనిని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటారు. క్రమం తప్పకుండా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి.

 చిన్న లోన్స్ తో క్రెడిట్ హిస్టరీ:

చిన్న లోన్స్ తో క్రెడిట్ హిస్టరీ:

పైన పేర్కొన్నవే కాకుండా.. మీరు EMI కొనుగోళ్లు చేయడం, వాటిని సకాలంలో తిరిగి చెల్లించడం, చిన్న మెుత్తంలో పర్సనల్ లోన్ తీసుకోవడం ద్వారా కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవచ్చు. ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకుండా మీ స్వంతంగా లోన్స్ పొందడంలో మీకు సమస్య ఉంటే.. మీరు జాయింట్ లోన్ తీసుకోవచ్చు లేదా మీ తల్లిదండ్రులను గ్యారంటర్‌గా ఉంచి రుణాన్ని పొందవచ్చు.

English summary

Credit Score: కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా..? క్రెడిట్ స్కోర్ ఇలా బిల్డ్ చేసుకోండి.. | important things a beginner should do to build a good credit score and cibil

new to credit card know how to build good credit score
Story first published: Friday, July 1, 2022, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X