For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటిని కొనుగోలు చేస్తున్నారా, అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి

|

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల! సొంతిల్లుతో భద్రతతో పాటు స్వేచ్ఛానుభూతి ఉంటుంది. ఒక ఇంటిని కొనుగోలు చేయడం దాదాపు ఎవరికైనా ఒక జీవిత కాల అతిపెద్ద లక్ష్యం. ఇలాంటి దీర్ఘకాలిక, పెద్ద లక్ష్యాన్ని ఎలాంటి ప్రణాళిక లేకుండా చేయడం కష్టం. ఇంటిని కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు మొదటి అడుగు వాస్తవ వ్యయాన్ని అర్థం చేసుకోవడం.... మూల్యాంకణం చేయడం. కొనుగోలుదారు వేసే అంచనాలకు బిల్డర్ లేదా విక్రేత వేసే అంచనాలు భిన్నంగా ఉంటాయి. కొనుగోలుదారు వేసే అంచనాల కంటే ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే అదనపు ఛార్జీలు, చెల్లించాల్సిన అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇంటిని కొనుగోలు చేస్తే ఆర్థిక ప్రణాళిక దారి తప్పుతుంది. కాబట్టి పక్కా ప్లాన్‌తో కొనుగోలు చేయాలి. మీ డ్రీమ్ హౌస్ కొనుగోలు చేయడానికి ముందు మీరు పలు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడు మీ ఫైనాన్స్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.

స్టాంప్ డ్యూటీ

స్టాంప్ డ్యూటీ

ఆస్తి ట్రాన్సాక్షన్‌పై ప్ర‌భుత్వం విధించే త‌ప్ప‌నిస‌రి ప‌న్ను స్టాంప్ డ్యూటీ. ఇది అమ్మ‌క‌పు ఒప్పందాన్ని ధృవీక‌రిస్తుంది. ఆస్తి అమ్మ‌కం లేదా కొనుగోలుకు సాక్ష్యంగా ప‌ని చేస్తుంది. ఇల్లు ఉన్న రాష్ట్రం, ఇంటి వ్యాల్యూ త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఆస్తి వ్యాల్యూలో నాలుగు శాతం నుండి ఏడు శాతం మ‌ధ్య స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఉదాహరణకు మీరు కొనుగోలు చేస్తున్న ఇంటి వ్యాల్యూ రూ.50 ల‌క్ష‌లు ఉంటే స్టాంప్ డ్యూటీ రూ.2 ల‌క్ష‌ల నుండి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఇది ఇంటి కొనుగోలుకు అయ్యే ఖ‌ర్చును పెంచుతుంది. స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అలాగే ఆస్తి ఉన్న ప్రదేశాన్ని బట్టి స్టాంప్ డ్యూటీ మారుతుంది. అస్తి గ్రామీణ ప్రాంతంలో ఉంటే స్టాంప్ డ్యూటీ కాస్త తక్కువ, పట్టణంలో కాస్త ఎక్కువగా ఉంటుంది. కొన్నిచోట్ల మహిళలు, అఫర్డబుల్ ఇళ్ల కొనుగోలుపై స్టాంప్ డ్యూటీపై ఒక శాతం రాయితీని అందిస్తున్నాయి. ఆయా రాష్ట్రాన్ని బట్టి స్టాంప్ డ్యూటీలు ఉంటాయి. కాబట్టి వ్యత్యాసం ఉంటుంది.

రిజిస్ట్రేషన్, జీఎస్టీ ఛార్జీలు

రిజిస్ట్రేషన్, జీఎస్టీ ఛార్జీలు

కొనుగోలు సమయంలో ప్రభుత్వం విధించే వాటిలో రిజిస్ట్రేషన్ ఛార్జీ ఉంటుంది. కొనుగోలుదారుపై ఆస్తి నమోదు, ఆస్తి యాజమాన్య రికార్డ్స్ అప్ డేట్‌కు రిజిస్ట్రేషన్ ఛార్జీలు విధిస్తారు. ఈ ఛార్జీ ఇంటి వ్యాల్యూ ఒక శాతంగా ఉంటుంది. రూ.50 లక్షల ఇంటి కొనుగోలుపై రూ.50వేల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీ చెల్లించాలి. దీనికి స్టాంప్ డ్యూటీ అదనం.

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే జీఎస్టీ వర్తిస్తుంది. నిర్మాణంలో ఉన్న అఫోర్డబుల్ ఇళ్లకు ఆస్తి వ్యాల్యూలో ఒక శాతం, మిగిలిన వాటికి ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అఫర్డబుల్ హౌస్ అంటే ఇంటి వ్యాల్యూ రూ.45 లక్షల లోపు ఉండాలి. మెట్రో నగరాల్లో అరవై చ.మీ. ఇతర ప్రాంతాల్లో 90 చ.మీ. కంటే తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు ఉండాలి.

ఆస్తి నిర్వహణ ఛార్జీలు ఇంటి ఖర్చులను ప్రభావితం చేస్తాయి. బిల్డర్స్ కొన్నింటికి ముందుగానే తీసుకుంటారు. నిర్వహణ ఛార్జీల్లోను లిఫ్ట్ ఛార్జీ, సెక్యూరిటీ ఛార్జీ, మేనేజ్‌మెంట్, వాటర్, విద్యుత్ వంటి ఛార్జీలుంటాయి.

హోమ్ లోన్ వ్యాల్యూ

హోమ్ లోన్ వ్యాల్యూ

ఇంటిని కొనుగోలు చేసే ముందు, ముఖ్యంగా నగరాల్లో కొనుగోలు చేస్తే మొదట పార్కింగ్ గురించి ఆలోచించాలి. సొంత ఫ్లాట్ లేదా ఇంటితో పార్కింగ్ ఛార్జీ ఉండదనే అభిప్రాయం ఉంటుంది. వాస్తవానికి సొసైటీలు, బిల్డర్స్ ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించి, ఛార్జీని విధిస్తారు. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉంటే పార్కింగ్ స్థలాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం రావొచ్చు. అదనపు ఖర్చులు ఇంటి వాస్తవ వ్యాల్యూలో పది శాతం నుండి పదిహేను శాతం వరకు ఉంటాయి. హోమ్ లోన్ తీసుకుంటే బ్యాంకులు కేవలం ఇంటి వ్యాల్యూని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయని గుర్తుంచుకోవాలి.

English summary

ఇంటిని కొనుగోలు చేస్తున్నారా, అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి | Important costs you should be aware of while buying a house

The first step in buying a house needs to be understanding and evaluating the actual cost of ownership of the house. Contrary to expectations, there will be a difference between the cost of ownership projected by the builder or seller and the actual cost of ownership.
Story first published: Tuesday, October 5, 2021, 20:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X