For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI: ఊహించని లాభాలు.. తగ్గిన మెుండి బాకాయిలు.. ఆయనకు మరోసారి ఛాన్స్..

|

ICICI: దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ICICI రెండ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ బలమైన లాభాలను ఆర్జించి అంచనాలను అధిగమించింది. బ్యాంక్ లాభంతో పాటు నికర వడ్డీ ఆదాయం సైతం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ఎసట్స్ క్వాలిటీ సైతం మెరుగుపడింది.

లాభం..

లాభం..

ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఏడాది ప్రాతిపదికన 37 శాకం పెరిగింది. FY23 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 7,558 కోట్లకు చేరుకుంది. ఇది గత త్రైమాసికంతో పోల్చితే దాదాపు రూ.1,950 కోట్లు అధికంమని చెప్పుకోవాలి. ఇదే క్రమంలో నికర వడ్డీ ఆదాయం 26 శాతం పెరిగి రూ.14,787 కోట్లకు చేరుకుంది.

నిరర్ధక ఆస్తులు తగ్గుదల..

నిరర్ధక ఆస్తులు తగ్గుదల..

బ్యాంక్ మెుండి బకాయిలు రెండవ క్వార్టర్ లో 3.19 శాతానికి తగ్గింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 3.41 శాతంగా ఉంది. ఇది కంపెనీ లాభదాయకత పెరగటానికి దోహదపడిందని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంక్ దేశవ్యాప్తంగా 5,614 శాఖలను కలిగి ఉంది. ఈ క్రమంలో బ్యాంక్ డిపాజిట్లు 12 శాతం వృద్ధితో రూ.10 లక్షల కోట్లను దాటాయి. ఇదే సమయంలో కరెంట్, సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లు సైతం 16 శాతం పెరిగాయని బ్యాంక్ వెల్లడించింది.

మరో మూడేళ్లు..

మరో మూడేళ్లు..

ICICI బ్యాంక్ దేశంలో అత్యంత లాభదాయకమైన ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటిగా పేరు గాంచింది. బ్యాంక్ లాభదాయకంగా పనిచేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO సందీప్ బక్షి. అందుకే.. ఐసిఐసిఐ మరో 3 ఏళ్ల పాటు ఆయననే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ఈ బాధ్యతలను అక్టోబర్ 15, 2018లో మెుదటిసారి చేపట్టారు. ఆయన గత 36 ఏళ్లుగా బ్యాంకులోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.

Read more about: icici results npa profits
English summary

ICICI: ఊహించని లాభాలు.. తగ్గిన మెుండి బాకాయిలు.. ఆయనకు మరోసారి ఛాన్స్.. | ICICI recorded 7,558 crores profit as NPA's drop, asset quality improved

ICICI recorded 7,558 crores profit as NPA's drop, asset quality improved
Story first published: Sunday, October 23, 2022, 15:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X