For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Alert: కొత్తరకం బ్యాంకింగ్ మోసం.. కస్టమర్లను అలర్ట్ చేసిన దిగ్గజ బ్యాంక్.. మీరూ తెలుసుకోండి..

|

Bank Alert: దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ రోజురోజుకూ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతోంది. సాంకేతికత అభివృద్ధితో కొత్త చెల్లింపు ఛానెల్‌లు తెరవబడ్డాయి. ఖాతాదారులకు సెకన్లలో పేమెంట్ చెల్లింపులకు, స్వీకరణకు ఇవి వీలు కల్పిస్తున్నాయి. అయితే.. ఖాతాదారులకు అత్యంత రక్షణ కల్పించేందుకు దేశీయ బ్యాంకులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. బ్యాంకింగ్ మోసాలు మాత్రం ఆగటం లేదు. సైబర్ నేరగాళ్లు వినియోగదారులను మోసం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. వీటిపై బ్యాంకులు సైతం ఎప్పటికప్పుడు వినియోగదారులను హెచ్చరిస్తూ, పలు జాగ్రత్తలు సైతం సూచిస్తూనే ఉన్నాయి.

కొత్త మార్గాల్లో హ్యాకింగ్..

కొత్త మార్గాల్లో హ్యాకింగ్..

హ్యాకర్లు ప్రతిరోజూ బ్యాంకు మోసాలకు పాల్పడేందుకు కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ ప్రైవేటు రంగం దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్‌లకు భద్రతను కాపాడుకోవడానికి ఒక ఈ-మెయిల్‌ను పంపింది. "మీరు, మీ ప్రియమైనవారి ఆర్థిక భద్రతను మేము ఎల్లప్పుడూ నిర్ధారించాము." సర్వసాధారణంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ క్రైమ్ గురించి మేము మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాము" అని ICICI బ్యాంక్ కొన్ని రోజుల క్రితం హెచ్చరికతో కూడిన ఈ- మెయిల్ ను వినియోగదారులకు పంపింది.

హ్యాక్ చేసిన ఖాతాలతో మోసాలు..

హ్యాక్ చేసిన ఖాతాలతో మోసాలు..

ICICI బ్యాంక్ ప్రకారం.. స్కామర్లు కస్టమర్ల వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ ఖాతాలను ఎక్కువగా టార్కెట్ చేస్తున్నారు. అర్జెంట్ అవసరం ఉందంటూ డబ్బు కావాలని కోరుతూ వ్యక్తుల సోషల్ మీడియా కనెక్షన్‌లకు సందేశాలు పంపుతున్నారు. అయితే ఇందుకోసం వారు సదరు వ్యక్తుల ఖాతాలను హ్యాక్ చేస్తున్నట్లు తెలిపింది. తెలిసినవారే కథ అని చాలా మంది అత్యవసరం అయి అడిగి ఉంటాడని నిర్ధారించుకోకుండానే డబ్బు పంపుతున్నారని బ్యాంక్ ఇటీవల జరిగిన మోసాల్లో గుర్తించింది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సదరు వ్యక్తి నంబరుకు కాల్ చేసి, వారి అవసరం గురించి తెలుసుకున్న తరువాతే డబ్బును పంపించాలని బ్యాంక్ తన ఈ మెయిల్ లో వెల్లడించింది.

డబ్బు ట్రాన్ఫర్ చేయకండి..

డబ్బు ట్రాన్ఫర్ చేయకండి..

ఈ తరుణంలో ఐసీఐసీఐ బ్యాంక్ కూడా వినియోగదారులను హెచ్చరించింది. "అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వాస్తవాలను ధృవీకరించుకోకుండా డబ్బు ట్రాన్ఫర్ చేయవద్దని హెచ్చరించింది. "మీ వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ ఖాతాలు ఏదైనా విధంగా హ్యాక్ చేయబడితే.. దయచేసి అధికారులకు చేయాలని సూచించింది. ఏటీఎం, డెబిట్ కార్డ్ మోసాలను నివారించటానికి పాటించవలసిన భద్రతా చిట్కాలను బ్యాంక్ తన ఈ- మెయిల్ ద్వారా తెలిపింది.

మోసాల నుంచి ఇలా జాగ్రత్త పడండి..

మోసాల నుంచి ఇలా జాగ్రత్త పడండి..

1. ATM/డెబిట్ కార్డ్‌ని మీ బ్యాంక్ ఖాతాకు కీలకమని గుర్తుంచుకోండి

2. మీ కార్డ్‌ను ఉపయోగించేందుకు ఇతరులకు ఇవ్వకండి. మీ పిన్‌ను ఎప్పుడూ, ఎక్కడా రాయవద్దు.

3. ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా మీ ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోకండి.

4. ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు మీ వెనుక ఎవరూ నిలబడకుండా చూసుకోండి. కీప్యాడ్‌ను మీ వేళ్లతో ఎల్లవేళలా కవర్ చేసి పిన్ నంబర్ ఎంటర్ చేయండి.

5. మీ PIN, పాస్‌వర్డ్‌లు లేదా ఇతర సున్నితమైన ఖాతా సమాచారాన్ని కోరుతూ ICICI బ్యాంక్ మీకు ఈ-మెయిల్ లేదా ఫోన్‌ను చేయదని గుర్తుంచుకోండి.

6. తెలియని ఈ-మెయిల్లోని లింక్‌లపై అస్సలు క్లిక్ చేయవద్దు. ఈ లింక్‌లు మిమ్మల్ని మోసపూరిత వెబ్‌సైట్‌లకు రీరూట్ చేసి మీ సమాచారాన్ని తస్కరిస్తాయి.

7. మీ బ్యాంకింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి మీరు తప్పనిసరిగా బ్యాంక్ SMS, ఈ-మెయిల్ నోటిఫికేషన్ సేవలకు సైన్ అప్ చేయాలి.

8. అనధికార లావాదేవీ జరిగితే, మీరు వెంటనే మీ బ్యాంక్‌కి సమాచారం అందించాలి.

9. మీరు మీ కార్డ్ వివరాలను మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఎప్పుడూ స్టోర్ చేయకూడదని ICICI బ్యాంక్ సూచించింది.

English summary

Bank Alert: కొత్తరకం బ్యాంకింగ్ మోసం.. కస్టమర్లను అలర్ట్ చేసిన దిగ్గజ బ్యాంక్.. మీరూ తెలుసుకోండి.. | ICICI Bank alerts it's customers against new banking scam of cyber fraudsters and gave safety guidelines

ICICI Bank alerts it's customers against new banking scam know details
Story first published: Friday, July 8, 2022, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X