For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral News: ఉద్యోగులను తొలగించినందుకు బాధతో ఏడ్చిన సీఈవో.. సోషల్ మీడియాలో వైరల్..

|

Crying CEO: ఇటీవలి కాలంలో ఉద్యోగుల తొలగింపులు పెరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీలు కూడా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఉద్యోగులు ఆందోళన చెందటం, బాధపడటం గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఉద్యోగులను తొలగించినందుకు ఒక కంపెనీ సీఈవో కన్నీటి పర్యంతం కావటం మన ఊహకందని విషయం. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి బాస్.. వాళ్లెందుకు ఏడుస్తారని మీకు అనుమానం కలగవచ్చు. అయితే ఇది నిజంగా జరిగింది కూడా.

 వైరల్ పోస్ట్..

వైరల్ పోస్ట్..

కంపెనీలు ఉద్యోగులను తొలగించాలనుకునే నిర్ణయాన్ని అంత సులువుగా తీసుకోవు. దానికి ముందు కనీసం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయి. ఎందుకంటే అది ఉద్యోగులకు తీవ్ర బాధ కలిగించటమేకాక వారి జీవితాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హైపర్‌సోషియల్ అనే కొలంబస్, ఒహియోకు చెందిన మార్కెటింగ్ ఏజెన్సీ సీఈవో బ్రాడెన్ వాలేక్. కంపెనీ ఉద్యోగులను తొలగించటం పట్ల పశ్చాత్తాపంతో కూడిన పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో వైరల్ గా మారింది. కానీ అది చివరికి కన్నీటితో కూడిన సెల్ఫీతో ముగిసింది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన 14 గంటల్లోనే నెటిజన్లు 13,000 లైక్‌లు, 2200 కమాండ్‌లను పోస్ట్ చేశారు.

బ్రాడెన్ ఏమన్నాడు?

బ్రాడెన్ ఏమన్నాడు?

నేను మా సిబ్బందిలో కొంతమందిని తొలగించవలసి వచ్చింది. నేను గత కొన్ని వారాలుగా లింక్డ్‌ఇన్‌లో కొన్ని తొలగింపులను చూస్తున్నాను. వాటిలో చాలా వరకు ఆర్థిక లేదా ఇతర కారణాల వల్ల సంభవించాయని అన్నారు.

 కష్టమైన నిర్ణయం

కష్టమైన నిర్ణయం

అదే పోస్ట్‌లో కొనసాగడం నా తప్పు, నేను గత ఫిబ్రవరిలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా కాలంగా ఆ నిర్ణయంలోనే ఉన్నాను. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నామని మా టీమ్ చెబుతుంది. కానీ నేను నడిపించాను. నేను అందరిలాగా డబ్బుకోసమే వ్యాపారాన్ని నడిపే వ్యక్తిని కానని చెప్పుకొచ్చాడు. ఉద్యోగాలు అవసరమైన వ్యక్తులకు సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

నెటిజన్ల కామెంట్స్ ఇలా..

నెటిజన్ల కామెంట్స్ ఇలా..

సింపతీ కోసమే ఉద్యోగులను తొలగించి ఇలా నటిస్తున్నారంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ మరికొందరు అంటున్నారు. దీనిపై బ్లూమ్‌బర్గ్‌ ప్రతినిధులు సదరు సీఈవోను సంప్రదించగా.. తాను సింపతీ కోసమో లేక మార్కెటింగ్ స్ట్రాటజీనో కాదని వివరించాడు. ఉద్యోగాలు కోల్పోయిన తన కంపెనీ ఉద్యోగులకు ఉపయోగపడుతుందనే ఉద్యోశంతోనే తాను ఈ పోస్ట్ చేశానని వివరణ ఇచ్చాడు. తన పోస్ట్ కారణంగా తన మాజీ ఉద్యోగుల్లో ఒక్కరికి ఉద్యోగం లభించినా తాను ఆనందిస్తానని బదులిచ్చాడు.

English summary

Viral News: ఉద్యోగులను తొలగించినందుకు బాధతో ఏడ్చిన సీఈవో.. సోషల్ మీడియాలో వైరల్.. | Hyper Social CEO Braden Wallake cried after laying off few of his employees post in linkedin going viral

Hyper Social CEO Braden Wallake cried after laying off his employees
Story first published: Thursday, August 11, 2022, 17:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X