For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Residential, office space: హైదరాబాద్ రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్ దూసుకెళ్తోంది

|

కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో 2021 ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. వార్షిక గృహ విక్రయాలపరంగా 2011 తర్వాత గత ఏడాది అత్యుత్తమ ఏడాదిగా నిలిచినట్లు 2021 ద్వితీయార్ధానికి రూపొందించిన నివేదికలో నైట్ ఫ్రాంక్ తెలిపింది. నివాస గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉన్నట్లు తెలిపింది. 2013 ప్రథమార్థం తర్వాత దేశవ్యాప్తంగా ఒక్క ఏడాది కూడా ధరలు తగ్గని పెద్ద నగరాల్లో హైదరాబాద్ మాత్రమేనని తెలిపింది.

2021 ద్వితీయార్థానికి ఇళ్ల విక్రయాల్లో దేశంలోనే హైదరాబాద్ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. 2021 ఏడాదిలో హైదరాబాద్ మార్కెట్లో 24,312 ఇళ్లు అమ్ముడుపోయాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఇది 142 శాతం అధికం. గత ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాలు దాదాపు 180 శాతం వరకు ఉన్నాయి. ఈ మొత్తం 35వేలకు పైగా ఉన్నాయి. 2021 రెండో అర్థ సంవత్సరంలో హైదరాబాదులో 13,344 ఇళ్లు విక్రయించగా, ఏడాది ప్రాతిపదికన ఇది 135 శాతం వృద్ధి. దేశంలో ఇది అత్యధిక వృద్ధి రేటు.

Hyderabad shows robust growth in residential, office space

ఇక ఇళ్ల విక్రయాల్లో రూ.50 లక్షల నుండి రూ.1 కోటి విలువైన ఇళ్ల విక్రయాలు 48 శాతం ఉండగా, అఫోర్డబుల్ ఇళ్ల విక్రయాలు 126 శాతం పెరిగి 19,204 ఇళ్లకు చేరుకున్నాయి. కొనుగోలుదారుల దృక్పథం మారుతోందని, సౌకర్యాలను బట్టి ఎక్కువ మొత్తం చెల్లించేందుకు కూడా ఇష్టపడుతున్నారని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. మొత్తం ఇళ్ల విక్రయాల్లో వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో 60 శాతం ఉంది.

English summary

Residential, office space: హైదరాబాద్ రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్ దూసుకెళ్తోంది | Hyderabad shows robust growth in residential, office space

Despite Covid times, Hyderabad showed strong fundamentals in real estate, displaying continued growth in both residential and office space. The city’s residential and office asset classes have shown resilience in their performances, outperforming its counterparts across categories.
Story first published: Thursday, January 6, 2022, 18:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X