For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tourist spot: భారతీయులు ఎక్కువగా చూసిన సిటీ హైదరాబాద్, దుబాయ్

|

2019 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు ఎక్కువగా భాగ్యనగరానికి వచ్చారు. ఈ ఏడాది దేశంలోనే ఈ నగరం నెంబర్ వన్‌గా నిలిచింది. అంతర్జాతీయంగా అయితే దుబాయ్ మొదటిస్థానంలో నిలిచింది. డిజిటల్ ట్రావెల్ కంపెనీ Booking.com 2019లో దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యధికంగా భారతీయ టూరిస్టులు విజిట్ చేసిన సర్వే వివరాలు వెల్లడించింది.

'స్విస్ ఖాతాల వివరాలు ఇవ్వలేం, గోప్యంగా ఉంచాలని నిబంధన''స్విస్ ఖాతాల వివరాలు ఇవ్వలేం, గోప్యంగా ఉంచాలని నిబంధన'

మొదటి స్థానంలో భాగ్యనగరం

మొదటి స్థానంలో భాగ్యనగరం

ఈ సర్వేలో భారత్‌లో హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో టాప్ 5లో వరుసగా పుణే, జైపూర్, కొచ్చి, మైసూర్ ఉన్నాయి. 2019లో ఎక్కువ మంది భారతీయులు హైదరాబాదును సందర్శించేందుకు ప్రయాణాలు బుక్ చేసుకున్నారు. షిల్లాంగ్, మంగళూరు, రిషికేష్, గౌహతి, పుణేలకు కూడా కొంతకాలంగా పర్యాటకులు పెరుగుతున్నట్లు తెలిపింది.

జైపూర్ తర్వాత భాగ్యనగరమే

జైపూర్ తర్వాత భాగ్యనగరమే

ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు జరిగిన బుకింగ్స్ ఆధారంగా ఈ సర్వే చేసినట్లు తెలిపారు. దేశీ పర్యాటకులతో పాటు విదేశాల నుంచి కూడా భాగ్యనగరానికి ఎక్కువ మేదే వచ్చారు. ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, పోలాండ్, జపాన్, సింగపూర్ టూరిస్టులు ఎక్కువగా వచ్చారు. వీరిలో మెజార్టీ పర్యాటకులు జైపూర్ తర్వాత భాగ్యనగరానికి విచ్చేశారు. ఆ తర్వాత పుణే, కొచ్చి, ఆగ్రా, ఢిల్లి-NCR ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి.

దుబాయ్ సహా టాప్ 5 నగరాలు

దుబాయ్ సహా టాప్ 5 నగరాలు

విదేశీ నగరాల విషయానికి వస్తే ఎక్కువమంది భారతీయులు దుబాయ్‌ని సందర్శంచారు. ఆ తర్వాత బ్యాంకాంక్ రెండో స్థానంలో ఉంది. సింగపూర్, లండన్, కౌలాలంపూర్ వరుసగా 3, 4, 5వస్థానాల్లో నిలిచాయి. ఇస్తాంబుల్ (టర్కీ), పుకెట్ (పటాంగ్ బీచ్‌), వియత్నాం (హనోయ్, హో చీ మిన్ సిటీ), ఉబుద్ (ఇండోనేషియా), టోక్యో (జపాన్‌) నగరాలను సందర్శించే పర్యాటకులు కూడా భారత్ నుంచి పెరుగుతున్నారు.

English summary

Tourist spot: భారతీయులు ఎక్కువగా చూసిన సిటీ హైదరాబాద్, దుబాయ్ | Hyderabad, Dubai most preferred destinations for Indians in 2019

Hyderabad has emerged as the top domestic destination for Indians travelling in 2019 while Dubai as the most preferred international spot, according to a survey.
Story first published: Tuesday, December 24, 2019, 13:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X