For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూనికార్న్ క్లబ్‌లో చేరిన హైదరాబాద్ టెక్ స్టార్టప్ డార్విన్ బాక్స్

|

హైదరాబాద్‌కు చెందిన హెచ్ఆర్ టెక్నాలజీ సేవల్లోని స్టార్టప్ డార్విన్‌బాక్స్ యూనికార్న్ క్లబ్‌లో చేరింది. సంస్థాగత వ్యాల్యూ 100 కోట్ల డాలర్లకు చేరడంతో ఈ జాబితాలోకి వచ్చింది. 100 కోట్ల డాలర్లను క్రాస్ చేస్తే యూనీకార్న్ సంస్థగా పిలుస్తారు. మన రూపాయి కరెన్సీలో ఇది రూ.7500 కోట్లకు పైన. డార్విన్ బాక్స్ తాజాగా రూ.538 కోట్ల మూలధన నిధులు సమీకరించింది. బిలియన్ డాలర్ల సంస్థాగత వ్యాల్యూ ప్రకారం ఈ నిధులు లభించినట్లు డార్విన్ బాక్స్ తెలిపింది.

హైదరాబాద్ నుండి యూనికార్న్ క్లబ్‌లో చేరిన తొలి స్టార్టప్‌గా నిలిచింది. గత ఏడాది ఫండ్ రెయిజ్ చేసినప్పటి నుండి ఇది 200 శాతం వృద్ధి సాధించడం గమనార్హం. ఇది క్లౌడ్ ఆధారిత హెచ్ఆర్ టెక్ ప్లాట్‌ఫామ్. మెకెన్సీ, గూగుల్, ఈవై వంటి దిగ్గజ కంపెనీలతో కలిసి పని చేస్తోంది. 650కి పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ ఫౌండర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన చైతన్య పెద్ది, జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని 2015 నవంబర్ నెలలో దీనిని ప్రారంభించారు.

Hyderabad based technology startup Darwinbox turns unicorn after raising $72 million

ఈ సంస్థకు టీజీవీ, సేల్స్ ఫోర్స్ వెంచర్స్, సిఖోయా, లైట్ స్పీడ్, ఎండియా పార్ట్‌నర్స్, 3వన్4 కేపిటల్ నిధులు సమకూర్చాయి. ఈ సంస్థ ఇప్పటి వరకు 110 మిలియన్ డాలర్ల మేరకు మూలధన నిధులను సమీకరించింది. తాజాగా లభించిన మూలధనంతో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని, కొత్త టెక్నాలజీ సేవలు ఆవిష్కరించడంపై దృష్టి సారిస్తామని తెలిపింది.

English summary

యూనికార్న్ క్లబ్‌లో చేరిన హైదరాబాద్ టెక్ స్టార్టప్ డార్విన్ బాక్స్ | Hyderabad based technology startup Darwinbox turns unicorn after raising $72 million

Hyderabad-based technology startup Darwinbox has turned unicorn with the raising of $72 million funding in the latest round for global expansion. With this round, the company's valuation will cross the $1 billion mark and take the total investment raised thus far by the company to over $110 million.
Story first published: Wednesday, January 26, 2022, 19:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X