For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ ఖ్యాతి.. ప్రపంచంలోనే అత్యంత..

|

airport: అన్నిరంగాల్లో తెలంగాణ దూసుకపోతోంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అంతర్జాతీయంగా వివిధ విభాగాల్లో సత్తా చాటుతోంది. విమానయాన రంగంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఈ విభాగానికి పునరుజ్జీవం పోసినట్లయింది. ఇందులోనూ ప్రపంచంతో రాష్ట్రం పోటీ పడుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం తాజాగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

ఏవియేషన్ ఎనలిటిక్స్ కంపెనీ సిరియం ఇటీవల ఓ నివేదిక ప్రచురించింది. దాని ప్రకారం మార్చి 2023లో GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 90.43 శాతం ఆన్-టైమ్ పనితీరును కనబరిచింది. ఈ విభాగంలో ప్రపంచంలోనే 90 శాతం దాటిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ కావడం విశేషం. 5 మిలియన్లకు పైగా విమానాల కేటగిరీలో 'గ్లోబల్ ఎయిర్‌ పోర్టులు' మరియు 'పెద్ద విమానాశ్రయాలు' రెండింటిలోనూ మొదటి స్థానంలో నిలిచింది.

Hyderabad airport

88.44 శాతం ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్(OTP)తో నవంబర్ 2022లో హైదరాబాద్ విమానాశ్రయం పెద్ద ఎయిర్ పోర్టుల్లో నాల్గవ స్థానంలో నిలిచింది. విమానాశ్రయం రియల్ గేట్ డిపార్చర్ సర్వీస్ ఆధారంగా ఇందుకు ఎంపిక చేయబడింది. మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మరియు సెంట్రలైజ్డ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (AOCC), సమకాలీన సమాచార వ్యవస్థలు ఇక్కడ ప్రవేశపెట్టబడ్డాయి.

Hyderabad airport

ఈ ఫీట్ సాధించడంపై GMR హైదరాబాద్ అంతర్జీతీయ విమానాశ్రయం CEO ప్రదీప్ పనికర్ హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు తాజా సాంకేతిక ఆవిష్కరణలను ఇక్కడ అమలు చేయడం వల్లనే ఇది సాధ్యమైనట్లు వెల్లడించారు. అత్యుత్తమ ఆరరేషనల్ మెజర్స్, విమానాశ్రయం పనితీరును మెరుగుపరచేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించినట్లు పేర్కొన్నారు.

English summary

airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ ఖ్యాతి.. ప్రపంచంలోనే అత్యంత.. | Hyderabad airport stands most punctual airport in the world

Hyderabad airport stands most punctual airport in the world
Story first published: Sunday, May 14, 2023, 8:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X