For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ ఎస్టేట్‌లో అత్యధిక ధనికుడు బీజేపీ నేత, టాప్ 100లో తెలుగువాళ్లు

|

ముంబై: ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగంలోని 100 మంది కుబేరుల జాబితాను హురున్ విడుదల చేసింది. హురున్ రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్ 2019కి గాను విడుదల చేసిన జాబితాలో లోధా డెవలపర్స్ (ప్రస్తుతం మాక్రోటెక్స్ డెవలపర్స్) వ్యవస్థాపకులు మంగళ్ ప్రభాత్ లోధా అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి రూ.31,960 కోట్లు. ఆయనకు అగ్రస్థానం దక్కడం ఇది వరుసగా రెండోసారి.

జగన్ ప్రభుత్వం నిర్ణయం, ప్రజలపై రూ.700 కోట్ల భారం!జగన్ ప్రభుత్వం నిర్ణయం, ప్రజలపై రూ.700 కోట్ల భారం!

టాప్ 3 జాబితాలోని వారి సంపద

టాప్ 3 జాబితాలోని వారి సంపద

లోధా ఫ్యామిలీ సంపద ఈ ఏడాదిలో 18% పెరిగింది. ఎంపీ లోధా ప్రస్తుతం బీజేపీ ముంబై శాఖకు అధిపతిగా ఉన్నారు. ఈ జాబితాలో ఆయన తర్వాత డీఎల్ఎఫ్ వైస్ చైర్మన్ రాజీవ్‌ సింగ్‌, ఎంబసీ గ్రూప్ వ్యవస్థాపకులు జితేంద్ర విర్వానీలు 2, 3 స్థానాల్లో ఉన్నారు. క్రితం ఏడాదితో పోలిస్తే రాజీవ్ సింగ్ ఒక స్థానం ఎగబాకారు. ఆయన ఆస్తి రూ.రూ.25,080 కోట్లుగా ఉంది. గడిచిన ఏడాదిలో 42% వృద్ధి కనిపించింది. జితేంద్ర విర్వానీ సంపద రూ.24,750 కోట్లు. లోధా మినహా జాబితాలోని మిగతా 99 మంది ఆస్తులు 12 శాతం పెరిగింది.

ఈ 3 నగరాల్లోనే మూడొంతులు

ఈ 3 నగరాల్లోనే మూడొంతులు

హురున్ రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్ 2019 జాబితా ప్రకారం 100 మంది స్థిరాస్థి ధనవంతుల్లో 37 మంది ముంబైవాసులే. టాప్ 10లో 6గురు దేశ ఆర్థిక రాజధానికి చెందిన వారే. ఢిల్లీ, బెంగళూరు వాసులు 19 మంది చొప్పున ఉన్నారు. మరో విషయం ఏమంటే స్థిరాస్థి రంగంలోని భారతీయ కుబేరుల్లో నాలుగింట మూడొంతుల మంది ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు చెందినవారే. డాలర్ బిలియనీర్ల సంఖ్య కూడా పెరిగింది. 2019లో అమెరికా డాలర్ల విలువతో పోలిస్తే బిలియనీర్లుగా ఉన్న రియాల్డర్లు 9 మంది కాగా, అంతకుముందు ఏడాది 7గురు ఉన్నారు. అంటే ఇద్దరు పెరిగారు.

ఇలా లెక్కించారు

ఇలా లెక్కించారు

స్టాక్ మార్కెట్లలో ఉన్న సంస్థలకు వాటి మార్కెట్ విలువ ఆధారంగా, లేని సంస్థలకు వాటి ఇటీవలి ఆర్థిక ప్రకటనల ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30ని ప్రామాణిక వ్యవధిగా తీసుకుని అప్పటి వరకు ఉన్న వ్యాల్యూని లెక్కించి జాబితాను రూపొందించారు.

100 మంది ఆస్తి రూ.2.77 లక్షల కోట్లు

100 మంది ఆస్తి రూ.2.77 లక్షల కోట్లు

మొత్తం ఈ జాబితాలోని 100 మంది సంపద విలువ రూ.2.77 లక్షల కోట్లు. అంటే 39.5 బిలియన్ డాలర్లు. క్రితం ఏడాదితో పోలిస్తే 17 శాతం పెరిగింది. సగటున వీరి సంపద 16 శాతం పెరిగింది లేదా రూ.2,743 కోట్లు పెరిగింది. 2017తో పోలిస్తే రియాల్టర్ల సంపద 27 శాతం పెరిగింది. 2017 నుంచి ఈ జాబితా విడుదలవుతోంది. తాజా ఎడిషన్ మూడోది.

మహిళల్లో స్మిత టాప్

మహిళల్లో స్మిత టాప్

ఈ జాబితాలో 59 శాతం మంది తొలితరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎనిమిది మంది మహిళలు కొత్తగా జాబితాలో చేరారు. గోద్రేజ్ ప్రాపర్టీస్ స్మిత వి కృష్ణ ఈ జాబితాలో అత్యంత ధనిక మహిళగా నిలిచారు. టాప్ 100లో ఆమె 14వ స్థానంలో ఉన్నారు. ఈమె సంపద రూ.3,560 కోట్లు.

పిన్న వయస్కులు తెలుగువాళ్లే

పిన్న వయస్కులు తెలుగువాళ్లే

జాబితాలోని 100 మంది సగటు వయస్సు 59. 40 ఏళ్ల లోపు ఆరుగురు, 80 ఏళ్లకు పైబడిన వారు ముగ్గురు ఉన్నారు. పిన్న వయస్కుల్లో మైహోమ్ కన్స్ట్రక్షన్ జూపల్లి రామూరావు, జూపల్లి శ్యామ్ రావులు నిలిచారు. వీరి వయస్సు 33. వీరు తెలుగు వారు. వీరి సంపద రూ.740 కోట్లు. మైహోమ్ కన్స్ట్రక్షన్స్ మూడు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో ఉంది. ఇప్పటి వరకు పదహారుకు పైగా నివాస, వాణిజ్య ప్రాజెక్టులు పూర్తి చేసింది.

జాబితాలో తెలుగువాళ్లు, హైదరాబాద్ వాళ్ళు...

జాబితాలో తెలుగువాళ్లు, హైదరాబాద్ వాళ్ళు...

ఈ జాబితాలోని తెలుగువాళ్లు...

- సి వెంకటేశ్వర రెడ్డి - రూ.2,590.25 కోట్లు అపర్ణ కన్స్ట్రక్షన్

- సుబ్రమణ్యమ్ రెడ్డి రూ.2,570.27 కోట్లు అపర్ణ కన్స్ట్రక్షన్

- జూపల్లి రామూరావు రూ.740.52 మైహోమ్ కన్స్ట్రక్షన్స్

- జూపల్లి రంజిత్ రావు రూ.740.52 మైహోమ్ కన్స్ట్రక్షన్స్

- జూపల్లి శ్యామ్ రావు రూ.740.52 మైహోమ్ కన్స్ట్రక్షన్స్

- జూపల్లి వినోద్ రూ.740.52 మైహోమ్ కన్స్ట్రక్షన్స్

- జూపల్లి రామేశ్వర్ రావు రూ.710.58 మైహోమ్ కన్స్ట్రక్షన్స్

- జీవీకే రెడ్డి ఫ్యామిలీ రూ.610.65 తాజ్ జీవీకే

టాప్ 10 వీరే.. ఆస్తులు

టాప్ 10 వీరే.. ఆస్తులు

1. మంగళ్ ప్రభాత్ లోధా, కుటుంబ సభ్యులు - రూ.31,960 కోట్లు (ఆస్తి) - మాక్రోటెక్ డెవలరప్స్ (కంపెనీ), ముంబై (నివాసం).

2. రాజీవ్ సింగ్ - రూ.25,080 కోట్లు (ఆస్తి) - డీఎల్ఎఫ్ (కంపెనీ), న్యూఢిల్లీ (నివాసం).

3. జితేంద్ర విర్వాణీ - రూ.24.750 కోట్లు (ఆస్తి) - ఎంబసీ (కంపెనీ), బెంగళూరు (నివాసం).

4. నిరంజన్ హీరానందని - రూ.17,030 కోట్లు (ఆస్తి) - హీరానందని కమ్యూనిటీస్ (కంపెనీ), ముంబై (నివాసం).

5. చంద్ర రహేజా, కుటుంబం - రూ.15,480 కోట్లు (ఆస్తి) - కే రహేజా (కంపెనీ), ముంబై (నివాసం).

6. వికాస్ ఒబెరాయ్ - రూ.13,910 కోట్లు (ఆస్తి) - ఒబెరాయ్ రియాల్టీ (కంపెనీ), ముంబై (నివాసం).

7. రాజా బగ్యనే - రూ.9,960 కోట్లు (ఆస్తి) - బగ్యనే డెవలపర్స్ (కంపెనీ), బెంగళూరు (నివాసం).

8. సురేంద్ర హీరానందని - రూ.9,720 కోట్లు (ఆస్తి) - హౌజ్ ఆఫ్ హీరానందని (కంపెనీ), సింగపూర్ (నివాసం).

9. సుభాష్ రన్వాలా, ఫ్యామిలీ - రూ.7,100 కోట్లు (ఆస్తి) - రన్వాలా డెవలపర్స్ (కంపెనీ), ముంబై (నివాసం).

10. అజయ్ పిరమిల్, ఫ్యామిలీ - రూ.6,560 కోట్లు (ఆస్తి) - పిరమిల్ రియాల్టీ (కంపెనీ), ముంబై (నివాసం).

English summary

రియల్ ఎస్టేట్‌లో అత్యధిక ధనికుడు బీజేపీ నేత, టాప్ 100లో తెలుగువాళ్లు | Hurun Real Estate Rich List 2019: Lodha named India's richest real estate tycoon

Lodha Developers' M P Lodha and family has been named India's richest real estate entrepreneur with a wealth of Rs 31,960 crore followed by DLF's Rajiv Singh and Embassy group founder Jitendra Virwani in the second and third position respectively, according to a report.
Story first published: Tuesday, December 10, 2019, 12:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X