For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hurun list: యంగ్ కుబేరులు వీరే, రూ.1,200 కోట్లతో జాబితాలో విజయవాడ శ్రీహర్ష

|

సొంతగా ఎదిగి వ్యాపారరంగంలో మంచి విజయాలు సాధించి, సంపన్నులుగా మారిన భారత యువ వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ - హూరున్ ఇండియా వెల్లడించింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా 40-అండర్ సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020 పేరుతో రూపొందించిన జాబితాలో జెరోదా నితిన్ కామత్, నిఖిల్ కామత్‌లతో పాటు విజయవాడకు చెందిన శ్రీహర్ష మాజేటి చోటు దక్కించుకున్నారు. అగ్రస్థానంలో జెరోదా సోదరులు నిలిచారు. శ్రీహర్ష 15వ స్థానంలో ఉన్నారు. టాప్ 16 మంది ఉమ్మడి సంపద రూ.44,900 కోట్లుగా ఉంది.

ఏడేళ్ళ తర్వాత వన్‌ప్లస్ మొబైల్ కంపెనీలో భారీ కుదుపు! ఎందుకంటే..ఏడేళ్ళ తర్వాత వన్‌ప్లస్ మొబైల్ కంపెనీలో భారీ కుదుపు! ఎందుకంటే..

టాప్‌లో జెరోదా వ్యవస్థాపకులు

టాప్‌లో జెరోదా వ్యవస్థాపకులు

వీరి సంపద 2020లో 59 శాతం పెరిగింది. అండర్-40 జాబితాలోని వీరు స్థాపించిన 12 స్టార్టప్స్‌లలో 11 యూనీకార్న్. ఈ సంస్థల సంపద 1 బిలియన్ డాలర్లు దాటింది.

నితిన్ (40 సంవత్సరాలు), నిఖిల్ కామత్ (34) ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం జెరోధాను స్థాపించారు. ఖాతాదారుల సంఖ్యతో భారతదేశపు అతిపెద్ద స్టాక్ బ్రోకర్‌గా ఎదిగారు. రూ.24,000 కోట్ల సంపదతో జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.

మీడియా డాట్ నెట్‌కు చెందిన దివ్యాంక్ తురాఖియా(38) రూ.14,000 కోట్లతో జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక మహిళ దేవితా సరఫ్(39). వు టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకురాలు. 16వ స్థానంలో నిలిచారు.

జాబితాలో వీరే..

జాబితాలో వీరే..

- బెంగళూరుకు చెందిన జెరోదా వ్యవస్థాపకులు నితిన్ కామత్ & నిఖిల్ కామత్ సంపద రూ.24,000 కోట్లుగా ఉంది. వీరి సంపద ఈసారి 58% శాతం పెరిగింది. మొదటి స్థానంలో నిలిచారు.

- మీడియా డాట్ నెట్‌కు చెందిన దివ్యాంక్ తురాఖియా (38) సంపద రూ.14,000 కోట్లుగా ఉంది. ఈ ఏడాది సంపద 8 శాతం పెరిగింది. రెండో స్థానంలో ఉన్నారు.

- ఉడాన్‌కు చెందిన అమోద్ మాల్వియా (39), సుజీత్ కుమార్ (40), వైభవ్ గుప్తా (40) సంపద రూ.13,100 కోట్లు. ఈయన సంపద 274 శాతం పెరిగింది. వీరు ముగ్గురు మూడో స్థానంలో ఉన్నారు.

- థింక్ అండ్ లర్న్ కంపెనీకి చెందిన రిజు రవీంద్రన్ రూ(39) రూ.7,800 కోట్లతో 6వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద 117 శాతం పెరిగింది.

- ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్ (37), సచిన్ బన్సాల్ (39) సంపద రూ.7500 కోట్లుగా ఉంది. వీరి సంపద వరుసగా 36 శాతం, 23 శాతం పెరిగింది.

- ఓరావెల్ స్టేస్‌కు చెందిన రితేష్ అగర్వాల్ (26) సంపద రూ.4500 కోట్లుగా ఉంది. ఈయన సంపద ఈసారి 40 శాతం క్షీణించింది. జాబితాలో 9వ స్థానంలో నిలిచారు.

- ఏఎన్ఐ టెక్నాలజీస్‌కు చెందిన భవీష్ అగర్వాల్ (35) సంపద రూ.3500 కోట్లు. జాబితాలో 10వ స్థానంలో నిలిచిన ఈయన ఆస్తి ఈ ఏడాది 13 శాతం పెరిగింది.

- రివిగో కంపెనీ వ్యవస్థాపకులు దీపక్ గార్గ్ (39) రూ.3200 కోట్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఈయన సంపద 14 శాతం పెరిగింది.

- ఇంప్రోబబుల్ వర్ల్డ్స్ వ్యవస్థాపకులు హేర్మాన్ నారులా (32) సంపద రూ.2900 కోట్లుగా ఉంది. సంపద ఈ ఏడాది 45 శాతం పెరిగింది. జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు.

- జొమాటో మీడియా వ్యవస్థాపకులు దీపిందర్ గోయల్ (37) సంపద 16 శాతం పెరిగి రూ.2200 కోట్లుగా ఉంది. ఈయన 13వ స్థానంలో నిలిచారు.

- ఏఎన్ఐ టెక్నాలజీస్‌కు చెందిన అంకిత్ భాటీ (34) సంపద రూ.1600 కోట్లు. జాబితాలో 14వ స్థానంలో నిలిచిన ఈయన ఆస్తి ఈ ఏడాది 14 శాతం పెరిగింది.

- విజయవాడకు చెందిన బుందిల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజెటీ సంపద రూ.1400 కోట్లు. జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు.

శ్రీహర్ష మాజేటీ... స్విగ్గీ మాతృసంస్థ

శ్రీహర్ష మాజేటీ... స్విగ్గీ మాతృసంస్థ

బండిల్ టెక్నాలజీస్ అనే సంస్థ సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ హోల్డింగ్ సంస్థ ఇది. శ్రీహర్ష బిట్స్ పిలానీలో చదివారు. నందన్ రెడ్డితో కలిసి 2013లో బండిల్ టెక్నాలజీస్ ప్రారంభించారు. టైర్ 2 పట్టణం నుండి చోటు సంపాదించిన ఏకైక వ్యక్తి ఇతను. స్విగ్గీకి టెన్సెంట్ హోల్డింగ్స్, నాస్పెర్స్ లిమిటెడ్, డీఎస్టీ గ్లోబల్ వంటి సంస్థలు పెట్టుబడులు సమకూర్చాయి. శ్రీహర్ష గత ఏడాది కూడా ఈ జాబితాలో ఉన్నారు. 39వ స్థానంలో నిలిచిన మహిళ దేవితా రాజ్‌కుమార్ సరఫ్ సంపద ఈ ఏఢాది 33 శాతం తగ్గింది. ఆమె ఆస్తి రూ.1200 కోట్లుగా ఉంది. 2006లో వీయు టెక్నాలజీస్ అనే టీవీల, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు విక్రయించే సంస్థను ప్రారంభించారు.

English summary

Hurun list: యంగ్ కుబేరులు వీరే, రూ.1,200 కోట్లతో జాబితాలో విజయవాడ శ్రీహర్ష | Hurun list: Sriharsha Majety in wealthiest self made entrepreneurs under 40

IIFL Wealth and Hurun India on Wednesday released the "IIFL Wealth Hurun India 40 & Under Self-Made Rich List 2020", which shows the cumulative wealth of India's wealthiest self-made entrepreneurs under 40 rose 59% in the year 2020.
Story first published: Wednesday, October 14, 2020, 14:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X